iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. కొత్త మెట్రో రూటుకు శ్రీకారం!

  • Published Aug 18, 2024 | 12:29 PM Updated Updated Aug 18, 2024 | 12:29 PM

CM Revanth Reddy: హైదరాబాద్ లో రోజు రోజుకీ జనాబా పెరిగిపోతుంది. దానికి తగ్గట్టు రోడ్లన్నీ రద్దీగా మారిపోతున్నాయి.. ప్రయాణాలు చేయాలంటే జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రయాణం కాస్త సులువైపోయింది.

CM Revanth Reddy: హైదరాబాద్ లో రోజు రోజుకీ జనాబా పెరిగిపోతుంది. దానికి తగ్గట్టు రోడ్లన్నీ రద్దీగా మారిపోతున్నాయి.. ప్రయాణాలు చేయాలంటే జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రయాణం కాస్త సులువైపోయింది.

  • Published Aug 18, 2024 | 12:29 PMUpdated Aug 18, 2024 | 12:29 PM
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. కొత్త మెట్రో రూటుకు శ్రీకారం!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. మహిళా సంక్షేమం  కోసం పలు పథకాలు అమల్లోకి తీసుకువచ్చారు.  రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. మెగా డిఎస్సీ‌తో పాటు అసెంబ్లీలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రజలకు తమను ఎంతో నమ్మకంతో ఈ అధికారాన్ని కట్టబెట్టారని.. వారి నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన భాద్యత తమపై ఉందని పలు సందర్భాల్లో అన్నారు రేవంత్ రెడ్డి. తాజాగా నగర వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ మహానగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణాలు కాస్త మెరుగయ్యాయి. రోడ్లపై ఎప్పుడూ రద్దీ, పొల్యూషన్, ప్రమాదాలు ఎన్నో ఇబ్బందులు నుంచి రిలీఫ్ అవుతున్నారు. ఆఫీసులు, స్కూల్, కాలేజ్, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లే వారు కాస్త ఖర్చైనా పరవాలేదు.. మెట్రో ప్రయాణాలకే సిద్దమవుతున్నారు జనాలు. నిత్యం వేలాది మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది.హైదరాబాద్ తరహా మరో కొత్త నగరాన్ని నిర్మిస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించారు. నాలుగేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నూతన నగరానికి మెట్రో రూట్ కూడా రానుంది.

హైదరాబాద్ సిటీ నుంచి ఫోర్త్ సిటికి రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహంచిన రేవంత్ రెడ్డి కొత్త సిటీకి రహదారి, మెట్రో రైలు మార్గాలను నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆ విధంగా నగరంలో కొత్త మెట్రో రూటుకు శ్రీకారం చుట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రూట్ మ్యాప్ ను అధికారులు రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం. ఈ అంశంపై రేవంత్ రెడ్డి సైతం అధికారలకు కీలక సూచనలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు- ఓఆర్ఆర్ నుంచి రిజినల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ వరకు ఈ మెట్రో మార్గాన్ని అనుసంధానం ఉండేలా ప్రణాళికలు రెడీ చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలోని బెగరికంచ ప్రాంతాన్ని.. ఫ్యూచర్ సిటిగా అభివృద్ది చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుందతి. బెగరికంచ సిటీకి విదేశాల నుంచి రూ. వేల కోట్ల ఇన్వెస్ట్ మంట్లు తీసుకు వచ్చి ఆరోగ్యం, క్రీడ, ఇతర కంపెనీ హబ్ గా మారుస్తానని ఆయన స్పష్టం చేశారు.