Hyderabad వాసులకు అలర్ట్‌.. ఆ రూట్లలో అస్సలు వెళ్లకండి

Hyderabad Traffic Restrictions-July 30th 2024: భాగ్యనగర వాసులకు ‍ట్రాఫిక్‌ పోలీసులు అలర్ట్‌ జారీ చేశారు. నేటి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఆ వివరాలు..

Hyderabad Traffic Restrictions-July 30th 2024: భాగ్యనగర వాసులకు ‍ట్రాఫిక్‌ పోలీసులు అలర్ట్‌ జారీ చేశారు. నేటి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో దేశంలోని నలుమూలల నుంచి జనాలు ఇక్కడకు ఉపాధి నిమిత్తం వస్తుంటారు. ఇక భాగ్యనగరంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, ఎంఎన్‌సీలు ఉన్నాయి. తెలంగాణ మొత్తం జనాభాలో అత్యధిక భాగం హైదరాబాద్‌లోనే ఉంటుంది. దాంతో నగర వాసులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య.. ట్రాఫిక్‌. అవును ఉదయం 8గంటలు, మధ్యాహ్నం 3-4 మధ్య కాస్త ట్రాఫిక్‌ తక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ చూసిన వాహనాలు, మనుషులే కనిపిస్తారు రోడ్ల మీద. ఇక మన దురదృష్టం కొద్ది ఆఫీసు నుంచి వెళ్లే సమయానికి వర్షం పడింతో.. ఇక అంతే.. భారీ ట్రాఫిక్‌ జామ్‌లో గంటల తరబడి ఎదురు చూడాలి. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా హైదరాబాద్‌ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో మంగళవారం నుంచి పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ప్లైఓవర్ల పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నగరలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయం గమనించి.. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాలు ఏవి అంటే.. ఐటీ కారిడార్ గచ్చిబౌలి సమీపంలోని ఎస్ఆర్డీపీ శిల్పా లేఅవుట్ ఫేజ్-2 వద్ద పైవంతెన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. దాంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐదు రోజులపాటు ఈమార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. అలానే జెడ్పీహెచ్ఎస్ యూటర్న్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే మార్గంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

అంబర్పేటలోనూ ట్రాఫిక్‌ ఆంక్షలు..

ఇటు అంబర్పేటలోనూ ప్లైఓవర్ నిర్మాణ పనులు కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంబర్పేట-గోల్నాక మార్గంలో ప్లైఓవర్ పనులు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు వివరించారు. అలానే 6 వ నెంబర్ మార్గంలోని జంక్షన్ నుంచి గోల్నాక వెళ్లే మార్గంలో వాహనాలను సమీపంలోని జిందా తిలిస్మాత్ రోడ్డులోకి మళ్లిస్తున్నారు. అటు గోల్నాక నుంచి 6వ నెంబర్ జంక్షన్ వరకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండానే వాహనాలను అనుమతిస్తున్నారు. ఎన్సీసీ గేట్ నుంచి 6వ నెంబర్ జంక్షన్ వరకు వచ్చే ఆర్టీసీ బస్సులను తిలక్‌నగర్‌ అడ్డరోడ్డులోని ఫీవర్ ఆస్పత్రి వైపు మళ్లించారు. కాబట్టి ఈ మార్గాల్లో వెళ్లేవాహనదారులు కుదిరితే ప్రత్నామ్నాయ మార్గలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.లేదంటే చిక్కులు తప్పవు అంటున్నారు.

Show comments