హైదరాబాద్ లో ఎప్పుడూ లేని స్థాయిలో ఎండలు! దీనికి కారణం ఏమిటంటే?

Hyderabad, Summer: తెలంగాణలో ఎండలు అదరగొడుతున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరమైన హైదరాబాద్ లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి..హైదరాబాద్ లో ఈ స్థాయిలో ఎండలు ఉండటానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

Hyderabad, Summer: తెలంగాణలో ఎండలు అదరగొడుతున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరమైన హైదరాబాద్ లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి..హైదరాబాద్ లో ఈ స్థాయిలో ఎండలు ఉండటానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా   ఎండలు అదిరిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉప్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మండే సూర్యుడి , ఆయన సెగల దెబ్బకు బయటకు వచ్చేదంకు జనం భయపడిపోతున్నారు.  ఇక నగరాల్లో ఉండే ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  బిల్టింగ్ లో ఉంటూ ఎండల వేడికి అల్లాడిపోతున్నారు.  ఇది ఇలా ఉంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎండలు దంచికొడుతున్నాయి. తాము గతంలో ఎప్పుడూ ఇలాంటి వేడి తాపం అనుభవించలేదని నగర వాసులు చెబుతున్నారు. మరి.. భాగ్యనగరం ఇలా అగ్నిగోళంగా ఉండటానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ రాష్ట్రంలో సమ్మర్ హీట్ మాములుగా లేదు. మే నెల రాకముందే సూర్యుడు బ్యాటింగ్  మొదలు పెట్టాడు.  క్రికెట్ లో రికార్డుల కోసం ప్లేయర్ సిక్సర్లు బాదినట్లు..తన రికార్డు కోసం సూర్యుడు కూడ ఎండల ను విజృభిస్తున్నాడు. ఈ  ఎండల వేడికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు  సమ్మర్ హీట్ కి అల్లాడిపోతున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లడం లేదు. ఇక తెలంగాణలోనే  పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అలానే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం కూడా ఎండల వేడికి విలవిల్లాడిపోతుంది. ఎప్పుడు లేని విధంగా  అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగానే హైదరాబాద్ నగరంలో పగటి పూట అత్యంత వేడిగాను, సాయంత్రం, రాత్రి వేళ అత్యంత చల్లగాను ఉంటుంది. ఇది భాగ్యనగరానికి ఉన్న ప్రత్యేకత.  ఎండకాలం కూడా హైదరాబాద్ నగరంలో రాత్రి వేళ చల్లగా ఉంటుంది. ఈ నగరం దక్కన్ పీఠభూమిలో ఉండటమే అందుకు కారణం. ఈ పీఠభూమిలో ఉండే ప్రాంతాల్లో పగటి పూట అత్యధిక వేడి, రాత్రి వేళ అత్యంత చల్లదనం ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలు దంచికొడుతున్నాయి. అలానే సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడుతుంది.

ముఖ్యంగా ఇటీవల కాలంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్లను విపరీతంగా నరకుతున్నారు. అలానే వాతావరణ మార్పుల కారణంగా ఇటువంటి తీవ్రమైన హీట్‌వేవ్ ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వాతావరణ కాలుష్యం, సకాలంలో వానలు పడకపోవడం వంటి ప్రకృతి కారణాలతో కూడా  ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.  వాహనాలు ఎక్కువగా వినియోగించడం, పారిశ్రామికరణ పెరిగిపోవడం వంటి ఇతర కారణాలతో కూడా భాగ్యనగరంలో ఎండలు పెరుగుతున్నాయి. మూములుగానే దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉండటతో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ స్వభావానికి ఇతర మానవ కారణాలు తోడుకావడంతోనే ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Show comments