iDreamPost
android-app
ios-app

రాత్రి 11 తరువాత రోడ్లపైకి వస్తున్నారా? ఇక పోలీసులు కుమ్మేస్తారు జాగ్రత్త!

ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11 దాటిన తరువాత ఎవరైనా రోడ్లపై ఓవరాక్షన్లు చేస్తే..తాట తీసేలా నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11 దాటిన తరువాత ఎవరైనా రోడ్లపై ఓవరాక్షన్లు చేస్తే..తాట తీసేలా నిర్ణయం తీసుకున్నారు.

రాత్రి 11 తరువాత  రోడ్లపైకి వస్తున్నారా? ఇక  పోలీసులు కుమ్మేస్తారు జాగ్రత్త!

ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస హత్యలు చోటుచేసుకున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 11.30 తరువాత లాఠీలకు పోలీసులు పని చెప్పనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడేది లేదంటూ పోలీసులు ఆకతాయిలకు వార్నింగ్ ఇస్తున్నారు. 11.30 తరువాత ఎవరైన గుమ్మిగూడితే, అలానే గొడవలు చేస్తుంటే లాఠీ ఛార్జీ చేయనున్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆదివారం రాత్రి నుంచి ఈ రూల్స్ ను నగర పోలీసులు అమలు చేయనున్నారు.  పోలీసుల చర్యలకు ప్రజలు సహకరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ పోలీసు కమిషన రేట్ పరిధిలో చోటుచేసుకుంటున్న వరుస హత్యలపై పోలీసులు దృష్టి సారించారు. సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేసే వారిని అణచివేసేందుకు కఠిన చర్యలకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. గత వారం రోజులుగా ఊహించని విధంగా వరుస హత్యలు జరిగాయి. ఇలాంటి ఘటనలన్ని కూడా రాత్రి 11 తరువాతనే జరగాయి. దీంతో కొత్త నిబంధనలను పోలీసు అధికారులు నగరంలో అమలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే  ఉండదనే విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారు.  కేవలం బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్  అమలులో ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే.. తుపాకులు కూడా పెట్టునేలా సీపీ స్థాయి అధికారి నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నిబంధనలు ఆదివారం నుంచి అమలులోకి వచ్చాయి.

Police strictly warning to Public

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి సంచలన నిర్ణయాలతో పాలనలో ముందుకు సాగుతున్నారు. ఓవైపు జనాలకు సంక్షేమ పాలన అందిస్తూనే.. మరోవైపు పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే డ్రగ్స్‌ కట్టడిపై దృష్టి పెట్టి..ఆమేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గంజాయి, మత్తు పదార్థాల కట్టడిలో కఠినంగా ఉండాలని సూచించారు. అలానే ఆహారం, వైద్యం అక్రమాలను అరికట్టేందుకు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు రేవంత్‌ రెడ్డి. ఈ క్రమంలో తాజాగా నేరాలను అరికట్టేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగరంలో దుకాణాలు రాత్రి 10.30 నుంచి 11 గంటల్లోపు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి.. గంజాయి సరఫరాదారులను, గంజాయి తీసుకునే వారిని వదిలిపెట్టేది లేదని.. అర్ధరాత్రి ఎవరైనా జులాయిగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటమని పోలీసులు హెచ్చరికాలు జారీ చేసినట్టుగా.. తెలంగాణ కాంగ్రెస్‌ తన అధికార ట్విట్టర్‌లో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.