iDreamPost
android-app
ios-app

Valentines Day: లవర్స్‌ డే నాడే పెళ్లి చేసుకున్న ప్రేమికులు.. ఆ వెంటనే

  • Published Feb 15, 2024 | 1:55 PM Updated Updated Feb 15, 2024 | 1:55 PM

ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్న వారిద్దరూ ప్రేమికుల దినోత్సవం నాడే వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే వారు చేసిన పనికి అందరూ షాక్‌ అయ్యారు. ఆ వివరాలు..

ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్న వారిద్దరూ ప్రేమికుల దినోత్సవం నాడే వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే వారు చేసిన పనికి అందరూ షాక్‌ అయ్యారు. ఆ వివరాలు..

  • Published Feb 15, 2024 | 1:55 PMUpdated Feb 15, 2024 | 1:55 PM
Valentines Day: లవర్స్‌ డే నాడే పెళ్లి చేసుకున్న ప్రేమికులు.. ఆ వెంటనే

లవర్స్‌, ప్రేమ వివాహం చేసుకున్న వారికి వాలెంటైన్స్‌ డే చాలా స్పెషల్‌. కొందరైతే తమ ప్రేమ విషయం చెప్పడానికి లవర్స్‌ డేనే ఎన్నుకుంటారు. అప్పటికే ప్రేమలో ఉన్నవారు లవర్స్‌ డేనాడే వివాహం చేసుకోవాలనుకుంటారు. వాలెంటైన్స్‌ డే వారి జీవితంలో మరుపురాని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని భావించి.. ఆరోజున ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా నిన్న లవర్స్‌ డే సందర్బంగా ఇద్దరు ప్రేమికులు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ప్రేమికుల దినోత్సవం నాడే లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న వారు ఆ తర్వాత ఊహించని పని చేశారు. ఇంతకు ఏం జరిగింది అంటే..

లవర్స్‌ డే ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. ఆరోజు తమ ప్రేమను వ్యక్తం చేయడం లేదంటే.. ప్రేమను గెలిపించుకోవడం అనగా పెళ్లి చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఇద్దరు లవర్స్‌ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. వాలెంటైన్స్‌ డే నాడు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తమకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన హైదరాబాద్‌ జల్‌పల్లి పరిధి శ్రీరామ్‌ కాలనీలో చోటు చేసుకుంది.

పహాడీషరీఫ్‌ పీఎస్‌ పరిధి శ్రీరామ్‌ నగర్‌ కాలనీకి చెందిన దివ్య, అరుణ్‌ కుమార్‌లు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో వారిద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకోవాలని భావించారు. ప్రేమికుల రోజు నాడే తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే లవర్స్‌ డే నాడు అనగా ఫిబ్రవరి 14, బుధవారం నాడు జల్‌పల్లిలోని గరిగుట్ట ఆలయానికి వెళ్లి వివాహం చేసుకున్నారు. పెళ్లి బంధంతో ఒక్కటైన తర్వాత వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తమ వివాహం గురించి చెప్పారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

అనంతరం నూతన దంపతులు మాట్లాడుతూ.. ‘‘మేం ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నాం. కానీ ఇంట్లోవాళ్లు మా పెళ్లికి అంగీకరించలేదు. దాంతో మేం గుడిలో వివాహం చేసుకున్నాం. దివ్య తల్లికి మా పెళ్లి ఇష్టం లేదు. ఆమెకు వేరే సంబంధం చూశారు. వచ్చే నెల దివ్యకు నిశ్చితార్థం చేయాలని ఆమె తల్లిదండ్రులు నిశ్చయించారు. అందుకే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పోలీసులు మా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ఎలాంటి సమస్య రాదని హామీ ఇచ్చారు’’ అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş