iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ మెట్రో సూపర్ రికార్డ్! బెంగుళూరు తరువాత ఆ రేంజ్ లో!

హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలు చాలా కీలకం. హైదరాబాద్‌ మెట్రోకు నగర ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్రో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దీన్ని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఈ క్రమంలో తాజాగా అరుదైన రికార్టు సొంతం చేసుకుంది.

హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలు చాలా కీలకం. హైదరాబాద్‌ మెట్రోకు నగర ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్రో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దీన్ని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఈ క్రమంలో తాజాగా అరుదైన రికార్టు సొంతం చేసుకుంది.

హైదరాబాద్ మెట్రో సూపర్ రికార్డ్! బెంగుళూరు తరువాత ఆ రేంజ్ లో!

హైదరాబాద్ లో మెట్రో రైలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ సమస్యలతో అల్లాడిపోతున్న నగర వాసులకు మెట్రో సేవలు వరమనే చెప్పాలి. హైదరాబాద్‌ మెట్రోకు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. లభిస్తోంది. మెట్రో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దీన్ని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. బెంగళూరు మెట్రో రికార్డు తరువాత హైదరాబాద్ మెట్రో ఉంది. మరి.. హైదరాబాద్ మెట్రో సాధించిన ఆ ఘనత ఏమిటో ఇప్పుడు చూద్దాం..

భాగ్యనగర ప్రజలకు మెట్రో సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 2017 నవంబర్ 27వ తేదీన ప్రారంభమైన మెట్రో సేవలు..ప్రజల నుంచి విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా సమ్మర్ లో అయితే మెట్రో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. అదరిపోయే ఎండలు, ట్రాఫిక్‌ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువ మంది ఈ మెట్రోలో జర్నీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి నేటికి అనేక మైళ్లు రాళ్లను హైద్రాబాద్ మెట్రో అందుకుంది. అలానే రద్దీ బాగా పెరగడంతో హైదరాబాద్‌ మెట్రో మరో మైలురాయిని అందుకున్నది. ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రో 50 కోట్ల మందిని గమ్య స్థానాలకు చేర్చి..రికార్డు సృష్టించింది.

HYD Metro

గతంలో దేశంలోనే మూడో అతిపొడవైన మెట్రో వ్యవస్థగా హైదరాబాద్ మెట్రోకు గుర్తింపు ఉంది. తొలుత మియాపూర్‌-అమీర్‌పేట మార్గంలో 11 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి దశల వారీగా సర్వీసులను పెంచుతూనే ఉన్నారు. ఎల్బీనగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోల్‌,రాయ్‌దుర్గ్ మార్గాల్లో దాదాపు 68 కిలోమీటర్ల పొడవైన మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నిత్యం హైదరాబాద్ మెట్రోలో దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. బెంగళూరు మెట్రో తరువాత హైదరాబాద్ ఆ స్థానంలో ఉంది. ఇక బెంగళూరు మెట్రో విషయానికి వస్తే.. ఇది  2011లో ప్రారంభమైంది. ఇది ఏర్పాటు అయిన ప్రారంభంలో తక్కువ మంది జర్నీ చేశారు.

ఆ తరువాత విపరీతమైన ఆదరణ లభించి..ప్రస్తుతం రోజూ 5 లక్షలపై చిలుకు మంది జర్నీ చేస్తున్నారు. ఈ 13 ఏళ్ల కాలంలో బెంగళూరు మెట్రో దాదాపు 200 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరినట్లు కొన్ని లెక్కలు చెబుతున్నాయి. అలానే హైదరాబాద్ మెట్రో ఈ ఎనిమిదేళ్ల కాలంలో 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరింది. బెంగళూరు మెట్రో రైలు రికార్డును  హైదరాబాద్  మెట్రో క్రాస్ చేయలేకపోవచ్చు. కానీ ఇదే లెక్కన 13 ఏళ్ల ప్రయాణం చేసేసరికి హైదరాబాద్ మెట్రో కూడా బెంగళూరు మెట్రో రికార్డు అందుకోవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అదే బెంగళూరు రేంజ్ లో హైదరాబాద్ మెట్రో పోటీ పడటంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి… హైదరాబాద్ మెట్రో సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.