రేపు రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు.. కారణం ఇదే!

Hyderabad Metro: హైదరాబాద్ నగరంలో మెట్రో పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా నిత్యం ఎంతో మంది ట్రాఫిక్ సమస్యలను తప్పించుకుని తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అయితే మెట్రో అధికారులు ఓ కీలక విషయం వెల్లడించారు.

Hyderabad Metro: హైదరాబాద్ నగరంలో మెట్రో పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా నిత్యం ఎంతో మంది ట్రాఫిక్ సమస్యలను తప్పించుకుని తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అయితే మెట్రో అధికారులు ఓ కీలక విషయం వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రారంభమైన మెట్రో రైళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యను తప్పించుకుని నగర శివారు ప్రాంతాలకు చేరే వారికి ఈ మెట్రో రైళ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలానే మెట్రో రైళ్లు ప్రయాణికులకు అనేక సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సమయం పాటు మెట్రో రైళ్లను నడుపుతుంటాయి. తాజాగా ఈనెల 25 గురువారం కూడా ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

భాగ్యనగరంలో మెట్రో సేవలు పరుగులు పెడుతున్నాయి. వీటి ద్వారా నిత్యం ఎంతో మంది ప్రయాణం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం సేవ్ అవుతుంది. ఇంకా మెట్రో సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక మెట్రో సేవల విషయానికి వస్తే..తరచూ ప్రత్యేక సందర్భాల్లో అదనపు సమయం కూడా మెట్రో రైళ్లు నడుస్తుంటాయి. గురువారం సైతం హైదరాబాద్ మెట్రో రైళ్లు ఒంటి గటం వరకు నడవున్నాయి. ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఆర్సీబీ తో ఎస్ఆర్ హెచ్ తలబడనుంది.

ఇప్పటికే ఈ మ్యాచ్ ను చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉప్పల్ ప్రాంతానికి చేరుకున్నారు. అలానే ఈ  మ్యాచ్ ను నపురస్కరించుకుని గురువారం రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల25న గురువారం అర్దరాత్రి 12.15 గంటలకు చివరి రైలు బయలుదేరి చివరి స్టేషన్‌కు 1.10 గంటలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. మ్యాచ్‌ను వీక్షించిన అనంతరం క్రికెట్‌ ఫ్యాన్స్ ఉప్పల్‌, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి రైళ్లు ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు సూచించారు.

ఇదే విధంగా గ్రేటర్‌ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తునట్లు తెలిపారు. కంటోన్మెంట్‌, ఇబ్రహీంపట్నం, ముషీరాబాద్‌ డిపో మేనేజర్లు ప్రత్యేక బస్సుల ఆపరేషన్స్‌ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. మొత్తంగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గురువారం మెట్రో రైళ్లు ఒంటిగంట వరకు నడవున్నాయి.

Show comments