Hyderabad మెట్రోలో సరికొత్త విధానం.. టికెట్‌ కొనకుండానే ప్రయాణం.. కానీ!

హైదరాబాద్‌ మెట్రో సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇకపై టికెట్‌ కొనకుండానే ప్రయాణం చేయవచ్చు. ఫ్రీ జర్నీనా అంటే కాదు. మరి ఎలా అంటే.. ఆ వివరాలు మీ కోసం..

హైదరాబాద్‌ మెట్రో సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇకపై టికెట్‌ కొనకుండానే ప్రయాణం చేయవచ్చు. ఫ్రీ జర్నీనా అంటే కాదు. మరి ఎలా అంటే.. ఆ వివరాలు మీ కోసం..

మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక నగరంలో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా మారింది. ట్రాఫిక్‌లో ఇరుక్కుని గంటలు గంటల ఎదురు చూసే పని లేకుండా.. చల్లగా ఏసీలో నిమిషాల వ్యవధిలోనే గమ్యానికి చేరుకునే సౌకర్యం కలగడంతో.. నగరాల్లో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారు.. మెట్రో వైపు మోగ్గు చూపుతున్నారు. ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో కూడా కొన్నాళ్ల క్రితమే మెట్రో పరుగులు ప్రారంభించింది. నగరం ఆ చివర నుంచి ఈ చివర వరకు కలుపుతూ మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. దాంతో నగరంలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్యులు దీనికే తమ ఓటు అంటున్నారు. ఇక హైదరాబాద్‌ మెట్రో ద్వారా రోజు లక్షల మంది గమ్య స్థానాలకు చేరుతుంటారు.

ఇక ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం హైదరాబాద్‌ మెట్రో ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలు అన్వేషిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ మెట్రో సరికొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే.. టికెట్‌ కొనకుండానే మెట్రోలో ప్రయాణం చేయవచ్చు.  ఆ వివరాలు..

సాధారణంగా ఇప్పుడు మెట్రోలో ప్రయాణం చేయాలంటే.. ముందుగానే టికెట్‌ కొనుక్కోవాలి. అది ఉంటేనే స్టేషన్‌ లోపలికి వెళ్లడం, రావడం కుదురుతుంది. టికెట్‌ లేకపోతే లోపలికి వెళ్లలేం.. బయటకు రాలేం. అయితే మెట్రో కొత్త విధానంలో ఈ సమస్యకు చెక్‌ పడనుంది. టికెట్‌ కొనకుండానే మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. ఇలా చెప్పగానే ఫ్రీ జర్నీ అనుకునేరు. కాదు. టికెట్‌ కొనకుండా రైలు ఎక్కవచ్చు. అయితే మీరు ఎంత దూరం ప్రయాణం చేశారు.. అందుకు ఎంత ఛార్జ్‌ అనేది మీరు గమ్యస్థానం చేరాక చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం మెట్రో విదేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఓపెన్‌ లూప్‌ టికెటింగ్‌ వ్యవస్థ(ఓటీఎస్‌) ను అమల్లోకి తీసుకురాబోతుంది. ఈమేరకు ఎల్‌ అండ్‌ టీ ప్రయత్నాలు చేస్తోంది.

ఏంటీ ఓటీఎస్‌ విధానం..

ఈ పద్దతిలో మెట్రో ప్రయాణం చేయాలనుకునేవారు ముందుగా టికెట్‌ కొనే అవసరం ఉండదు. ప్రయాణికులు తాము దిగిన తర్వాత.. దూరాన్ని బట్టి ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ సరికొత్త పద్దతిని ప్రస్తుత ఆర్థిక ఏడాది నుంచే ప్రవేశపెట్టేందుకు మెట్రో ప్లాన్ చేస్తుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రయాణాలు మరింత సులభం కానున్నాయి. నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డు (ఎన్‌సీఎంస) ద్వారా దీన్ని అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్‌ అన్నింటికీ ఒక్కటే కార్డుతో చెల్లింపులు చేయవచ్చు. ఈ విధానంలో ట్రైన్ ఎక్కేటప్పుడు కార్డును మెషీన్ వద్ద చూపించాలి.. మళ్లీ మనం దిగాల్సిన చోట ఎగ్జిట్ మిషన్ వద్ద చూపిస్తే జీపీఎస్‌ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి టికెట్ ఎంత ఛార్జీ అయ్యిందని వెల్లడించి.. ఈ మొత్తం కట్‌ చేస్తుంది.

ప్రస్తుతం మెట్రోలో ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తాము ఏ స్టేషన్‌లో దిగాలో ముందే నిర్ణయించుకొని అక్కడి వరకే టికెట్ తీసుకోవాలి. మనం టికెట్ తీసుకున్న ముందు స్టేషన్‌లో గానీ.. ఆ తర్వాత స్టేషన్‌లో గానీ దిగితే ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ వ్యవస్థ అనుమతించదు. దీని గురించి సిబ్బందిని సంపద్రిస్తే.. వారు జరిమానా వేసి మరీ బయటకు పంపుతారు. గమ్యస్థానానికి ముందు స్టేషన్‌లో దిగుదామన్నా అక్కడ గేటు తెర్చుకోదు. కానీ త్వరలోనే ప్రవేశపెట్టబోయే ఓటీఎస్‌ సిస్టంతో ఇలాంటి సమస్యలు ఉండవు. ప్రయాణించిన తర్వాతే దూరాన్ని బట్టి చెల్లింపులు చేస్తారు.

Show comments