మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై సోమ, శుక్రవారాల్లో..

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ట్రైన్ టైమింగ్స్ లో మార్పులు చేసింది. ఇకపై సోమ, శుక్రవారాల్లో ఆ టైమ్ వరకు ట్రైన్లను నడపనున్నారు.

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ట్రైన్ టైమింగ్స్ లో మార్పులు చేసింది. ఇకపై సోమ, శుక్రవారాల్లో ఆ టైమ్ వరకు ట్రైన్లను నడపనున్నారు.

హైదరాబాద్ నగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చాక ప్రయాణికులకు ప్రయాణ తిప్పలు తప్పాయి. ట్రాఫిక్ కష్టాల నుంచి కాస్త ఉపశమనం కలిగింది. చిరు ఉద్యోగులు, స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్, ఇతర వృత్తి పనులు చేసుకునే వారు మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. సమయం ఆదా అవుతుండడం, పొల్యూషన్ కూడా లేకపోవడంతో మెట్రోకు ఆదరణ పెరిగింది. నిత్యం వేలాది మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు హైదరాబాద్ మెట్రో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అందించింది. ట్రైన్ టైమింగ్స్ లో మార్పులు చేసింది.

హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో స్వల్ప మార్పులు చేశారు మెట్రో అధికారులు. ఇకపై మెట్రో ప్రయాణికులు అర్థరాత్రి వరకు ఏ ఇబ్బంది లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. సోమ, శుక్రవారాల్లో ట్రైన్ టైమింగ్స్ వేళల్లో మార్పులు చేసింది. గతంలో మెట్రో టైమింగ్స్ ను పొడిగించాలని ప్రయాణాకులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ (హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్) ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ట్రయల్ లో భాగంగా చివరి రైలు రన్నింగ్‌ వేళలను వారానికి ఒకరోజు పొడిగించారు. ఈ మారిన సమయాల్లో భాగంగా ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రోరైలు అధికారులు తెలిపారు.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి రైళ్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అయితే ఆయా సమయాల్లో మెట్రో రైళ్లకు ఉన్న ఆదరణ, ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చివరి మెట్రో రైలు శుక్రవారం రాత్రి 11.45 గంటలకు టెర్మినల్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని మెట్రో అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో నిర్ణయంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments