iDreamPost
android-app
ios-app

పండగ వేళ HYD మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..

మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో ఉగాది పండగ ఆఫర్ ను అందించింది. మెట్రో నిర్ణయంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ప్రయాణికులకు అందించిన గుడ్ న్యూస్ ఏంటంటే?

మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో ఉగాది పండగ ఆఫర్ ను అందించింది. మెట్రో నిర్ణయంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ప్రయాణికులకు అందించిన గుడ్ న్యూస్ ఏంటంటే?

పండగ వేళ HYD మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసింది హైదరాబాద్ మెట్రో. నిత్యం ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులు చేసుకునే వారు మెట్రోలో ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు హైదరాబాద్ మెట్రో పలు రకాలైన ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్తను అందించింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉగాది ఆఫర్ ప్రకటించింది. మరో 6 నెలలపాటు ఆఫర్లు పొడిగించింది హైదరాబాద్ మెట్రో. సూపర్ సేవర్ హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫర్ పీక్ అవర్ ఆఫర్లను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కాగా, సూపర్ సేవర్ హాలీడే కార్డులను రద్దు చేస్తున్నట్లు ఈనెల 2న హైదరాబాద్ మెట్రో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్‌లు మార్చి 31, 2024న ముగిశాయని హైదరాబాద్ మెట్రో ఎక్స్ ద్వారా ప్రకటించింది. స్టూడెంట్ మెట్రో కార్డ్‌తో ప్రయాణాలు 30 ఏప్రిల్ 2024 వరకు చెల్లుబాటులో ఉంటాయని చెప్పింది. దీంతో ప్రయాణికుల నుంచి అసహనం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్లను మరో ఆరు నెలలు పొడిగించింది హైదరాబాద్ మెట్రో.

కాగా ప్రయాణికులు తమ సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ను కేవలం రూ. 59తో రీఛార్జ్ చేయడం ద్వారా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో అపరిమితంగా ప్రయాణం చేసే వెసులుబాటు ఉండేది. అలాగే సూపర్ ఆఫర్ పీక్ అవర్ ఆఫర్ ద్వారా ఉదయం 6 నుంచి 8 వరకు, రాత్రి 8 నుంచి చివరి మెట్రో వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండేది. ఈ ఆఫర్ కింది సాధారణ కార్డు ద్వారా టికెట్ తీసుకుంటే ప్రయాణికులకు 10 శాతం రాయితీ అందించేవారు. మెట్రో తీసుకున్న తాజా నిర్ణయంతో ఆఫర్స్ ప్రయోజనాలు పొందనున్నారు ప్రయాణికులు.