iDreamPost
android-app
ios-app

వీడియో: హుస్సేన్‌ సాగర్‌లో దిగిన మందు బాబు .. 90 ML ఇస్తేనే వస్తానంటూ

  • Published Feb 28, 2024 | 9:46 AM Updated Updated Feb 28, 2024 | 9:46 AM

మద్యం మత్తులో మందుబాబులు చేసే పనులు కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ క్రమంలో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. మందు బాబు డిమాండ్‌ విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆవివరాలు..

మద్యం మత్తులో మందుబాబులు చేసే పనులు కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ క్రమంలో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. మందు బాబు డిమాండ్‌ విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆవివరాలు..

  • Published Feb 28, 2024 | 9:46 AMUpdated Feb 28, 2024 | 9:46 AM
వీడియో: హుస్సేన్‌ సాగర్‌లో దిగిన మందు బాబు .. 90 ML ఇస్తేనే వస్తానంటూ

నేటి సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక రకాల నేరాలకు మద్యపానమే కారణం. మద్యం మత్తులో తన, పర విచక్షణ మర్చిపోయి.. ప్రవర్తిస్తుంటారు మందుబాబులు. ఇక నేటి కాలంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాల్లో అత్యధిక వాటికి కారణం మద్యపానమే. ఇక మద్యం వల్ల సమాజంలో నేర ప్రవృత్తి పెరగడవంతో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే.. మద్యం వల్ల ఇళ్లు, ఒళ్లు కూడా గుల్లవుతుంది. మద్యపానం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాగి తాగి అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరో ఉన్నారు.

ఇక కొందరు మందుబాబులు మద్యం మత్తులో రకరకాల విచిత్ర విన్యాసాలకు పాల్పడతుంటారు. ఇక తాజాగా ఓ యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి హుస్సేన్‌సాగర్‌లో దిగాడు. ఆ తర్వాత అతడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియో నెల రోజుల క్రితంది అని చెబుతున్నారు. ఇక దీనిలో ఉన్న దాని ప్రకారం ఫుల్లుగా మద్యం సేవించిన ఓ యువకుడు.. హుస్సేన్‌ సాగార్‌లో దిగాడు. అతడిని గమనించిన పోలీసులు బయటకు రావాల్సిందిగా కోరారు. కానీ మనోడు.. చల్‌ నేను రాను.. నాకు ఇప్పుడు 90 ఎంఎల్‌ ఇస్తేనే వస్తాను అంటూ పోలీసులకే భారీ ఆఫర్‌ ఇచ్చాడు. వార్ని.. చస్తావ్‌ రా నాయనా.. బయటకు రారా అంటే.. లేదు మందు పోస్తేనే వస్తాను అన్న అతగాడిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. సరే బయటకు రా.. 90 ఏం ఖర్మ.. 180 ఎంఎల్‌ ఇస్తాము అంటూ అతగాడిని బుజ్జగించి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.

మద్యం మత్తులో రాత్రివేళ హుస్సేన్ సాగర్‌లో దిగిన యువకుడు.. 90 ఎంఎల్ మద్యం ఇస్తేనే బయటికి వస్తానంటూ పోలీసులతో వాదనకు దిగాడు. ఆ తర్వాత ఖాకీలు ఎలాగోలా తంటాలు పడి.. సదరు మందు బాబును బయటకు తీసుకువచ్చారు. మత్తు వదిలాక.. అతగాడికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపారు. మరి ఈ మందుబాబు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet