Hyderabad: అయ్యో పాపం.. ‘తప్పదు మాకు వేరే మార్గం లేదు క్షమించండంటూ’ లేఖ రాసి

ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం ఉన్నట్లుండి కనిపించకుండా పోయింది. రంగంలోకి దిగిన పోలీసులకు వారి ఇంట్లో.. దొరికిన ఓ లేఖలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు..

ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం ఉన్నట్లుండి కనిపించకుండా పోయింది. రంగంలోకి దిగిన పోలీసులకు వారి ఇంట్లో.. దొరికిన ఓ లేఖలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు..

వారిది అన్యోన్యమైన దాంపత్యం. నలుగురు సంతానం. ఎంతో కష్టపడి బిడ్డలందరిని చదివించారు. ముగ్గురు అమ్మాయిలకు మంచి సంబంధాలు చూసి వివాహాలు జరిపించారు. ఇక కుమారుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అతడి కోసం సంబంధాలు వెతుకుతున్నారు. ఎంతో సంతోషంగా కలకల్లాడే ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చాయో తెలియదు కానీ.. ఉన్నట్లుండి కుటుంబంలోని వారంతా.. కనిపించకుండా పోయారు. తల్లీదండ్రులు, సోదరుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం.. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన కుమార్తెలు.. వెంటనే దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకు ఆ కుటుంబానికి ఏం అయ్యింది.. వారంతా ఎక్కడకు వెళ్లారు అంటే..

హైదరాబాద్, మలక్ పేటలో ఈ సంఘటన వెలుగు చూసింది. మాకు చావు తప్ప వేరే మార్గం లేదు క్షమించండి.. అంటూ లేఖ రాసిపెట్టి ఓ కుటుంబం అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ కుటుంబంలోని వారంతా.. వారం రోజుల క్రితం అనగా.. ఈ నెల 20న ఇంటి నుంచి వెళ్లిపోగా.. వారి ఆచూకీ కోసం బంధువులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీమ్ నగర్‌లో వరాహమూర్తి, దుర్గ దంపతులు నివాసం ఉండే వారు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. ఇక వరాహమూర్తి.. వృత్తి రీత్యా గోల్డ్ స్మిత్ అనగా కంసాలి పని చేసేవాడు. ఎంతో కష్టపడి.. నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేశాడు.. చదివించాడు. ఆ తర్వాత ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు జరిపించాడు. ఈ క్రమంలో వరాహమూర్తి సుమారు 50 లక్షల వరకు అప్పులు చేశాడు. వచ్చే ఆదాయం కుటుంబం గడపడానికే సరిపోవడం లేదు.. ఇక కొండలా పేరుకుపోయిన ఈ అప్పును ఎలా తీర్చాలా అని తండ్రీకుమారులు తరచుగా చర్చించుకుని బాధపడేవారని.. బంధువులు తెలిపారు.

వరాహమూర్తి, ఆయన కుమారుడు సత్య భైరవ.. ప్రస్తుతం మొహమ్మద్ ఖాన్ జ్యూవెలరీ షాప్‌లో పనిచేస్తున్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ పని చేసినా సరే.. అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా ఆ ఆదాయం సరిపోవడం లేదని తెలుస్తోంది. వడ్డీలు కట్టీ కట్టీ అప్పుల్లో కూరుకుపోయింది వరాహమూర్తి కుటుంబం. రోజులు గడిచేకొద్ది.. అప్పులు భారం అంతకంతకు పెరగసాగింది. ఇక అప్పుల భారం నుంచి బయపటడం కోసం.. చావే శరణ్యమనే వారంతా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

దాంతో వరహామూర్తి, దుర్గ, వారి కుమారుడు సత్య భైరవ.. ఇంటి నుంచి వెళ్లిపోయారు. అంతేకాక ఓ లేఖ రాసి రాశారు. ‘మాకు చావు తప్ప మరో మార్గం లేదు. క్షమించండి. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు’ ఓ పేపర్ మీద రాసి పెట్టి, సెల్ ఫోన్లను ఇంట్లోనే వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం.. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. వరాహమూర్తి కుమార్తె చాముండేశ్వరి..  మలక్‌పేట పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show comments