లూలూ షాపింగ్‌ మాల్‌కు అరుదైన ఘనత.. ఏకంగా 5 స్టార్‌ రేటింగ్‌

లూలూ షాపింగ్‌ మాల్‌కు అరుదైన ఘనత.. ఏకంగా 5 స్టార్‌ రేటింగ్‌

నగరంలో షాపింగ్ మాల్స్ డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నగరంలో రోజు రోజుకి కొత్త కొత్త మాల్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఎన్ని మాల్స్ వచ్చిన లులు మాల్ కు ఉన్న క్రేజ్ వేరనే చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఈ లులు మాల్ కు అరుదైన ఘనత దక్కింది. ఇంతకీ అదేమిటంటే..

నగరంలో షాపింగ్ మాల్స్ డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నగరంలో రోజు రోజుకి కొత్త కొత్త మాల్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఎన్ని మాల్స్ వచ్చిన లులు మాల్ కు ఉన్న క్రేజ్ వేరనే చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఈ లులు మాల్ కు అరుదైన ఘనత దక్కింది. ఇంతకీ అదేమిటంటే..

నగరంలో రోజు రోజుకి షాపింగ్ మాల్స్ డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఎక్కడబడితే అక్కడ మాల్స్ సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు చాలామంది నిత్యవసర సరుకులు దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు వరకు ప్రతిది డిమార్ట్స్, షాపింగ్ మాల్స్ లోనే కొనుగోనులు చేస్తున్నారు. దీంతో ఇప్పుడంతా మాల్స్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇక అందుకు తగ్గట్టుగానే నగరంలో ఇప్పటికే ఫోరంమాల్, ఇనార్బిట్‌ మాల్‌, పీవీఆర్‌ ఐమాక్స్‌, నెక్ట్స్‌ గలేరియా, అశోక 1, డీమార్ట్‌, రత్న దీప్‌, మోర్‌, జియో మార్ట్‌, లులు మాల్స్ వంటివి ఉన్నాయి. అయితే నగరంలో ఎన్ని మాల్స్ ఉన్నా లులు మాల్ క్రేజ్ వేరు అనే చెప్పవచ్చు.

ఇక దీనిని గత సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ సమీపంలో ఓపెన్ చేశారు. కాగా, నగరంలో మొదటిసారిగా లులు గ్రూప్ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ యూసఫ్‌ అలీ ఎంఏ సమక్షంలో మాజీ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఇకపోతే దీనిని ఐదు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.500 కోట్ల పెట్టుబడిలో భాగంగా దీనిని నిర్మించారు.  అయితే తాజాగా ఈ మాల్ కు అరుదైన ఘనత దక్కింది. ఇంతకీ అదేమిటంటే..

హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఉన్న లులు మాల్‌కు తాజాగా అరుదైన ఘనత దక్కింది.  నగరంలో అతి పెద్ద షాపింగ్ మాల్ గా నిలిచిన ఈ లులు మాల్ కు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి 5 స్టార్‌ రేటింగ్‌ లభించింది.  ఎందుకంటే.. సినిమా హాల్, పలు ఫుట్ కోర్ట్ వంటి అనేక రకాల సౌకర్యలు కలిగి ఉన్న ఈ హైపర్ మార్కెట్ లో ఆహార భద్రత నిర్వహణపై దృష్టి సారించి, సిబ్బందికి క్రమ శిక్షణా కార్యక్రమాలు కలిగి ఉన్న సమగ్ర ఆహార భద్రత నిర్వహణ హైపర్‌ మార్కెట్ గా నిలవడంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి 5 స్టార్ రేటింగ్ అందింది. ముఖ్యంగా నగరంలో మొదటిసారి మాల్స్ కు 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్న ఘనత కూడా లులు మాల్ అనే చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే..  ప్రస్తుతం ఈ లులు మాల్స్ బెంగళూరు, కోయంబత్తూరు, కొచ్చి, లక్నో, తిరువనంతపురం, హైదరాబాద్ ఆరు భారతీయ నగరాల్లో మాత్రమే ఉన్నాయి. అయితే నగరంలో ఈ లులు మాల్ కి ఎందుకంత క్రేజ్ అంటే.. ఇక్కడ ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌ మీద కూడా పెద్ద ఎత్తున ఆఫర్లు ఉంటాయి. దీంతో పాటు నిత్యవసరాలు, పండ్లు, కూరగాయలు, చిరుతిళ్లు, మాంసం ఉత్పత్తులు, బట్టలు, చెప్పులు, కిచెన్‌, బెడ్రూం, ఎలక్ట్రానిక్స్‌ ఇలా ప్రతి అవసరానికి సంబంధించిన ఉత్తత్తులు అన్ని ఒకే చోట ఫ్రెష్ ఐటమ్స్ తక్కువ ధరకు లభించడం ఈ మాల్ కి అంత క్రేజ్ అని చెప్పవచ్చు. మరీ, లులు మాల్ కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి 5 స్టార్ రేటింగ్ అందుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments