Tirupathi Rao
Street Food Vendor Kumari Success Story: హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ కు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఒక మహిళ ఈ స్ట్రీట్ ఫుడ్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తోంది.
Street Food Vendor Kumari Success Story: హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ కు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఒక మహిళ ఈ స్ట్రీట్ ఫుడ్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తోంది.
Tirupathi Rao
ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ యూజర్లకు కుమారి పేరు కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆమెను నెటిజన్స్ అంతా అభిమానంగా కుమారి ఆంటీ అని పిలుస్తుంటారు. ఆమె చేతి వంటకు హైదరాబాద్ లో చాలామందే అభిమానులు ఉన్నారు. కేబుల్ బ్రిడ్జి దగ్గర్లోని ఐటీసీ కోహినూరు హోటల్ రోడ్డులో ఈవిడ ఫుడ్ పాయింట్ ఉంటుంది. సాధారణంగానే ఆవిడ సోషల్ మీడియాలో ఫేమస్ గతకొన్నిరోజులుగా మీమర్స్ పుణ్యమా అని మరింత వైరల్ అవుతోంది. అయితే ఈసారి కాస్త నెగిటివ్ టచ్ వచ్చిపడింది. ధరల విషయంలో ఆమెపై కాస్త ట్రోలింగ్ జరుగుతోంది. అసలు కుమారి సక్సెస్ స్టోరీ ఏంటో చూద్దాం.
ఐటీసీ కోహినూర్ హోటల్ రోడ్డులో ఫుడ్ స్ట్రీట్ ఉంటుందని దాదాపు హైదరాబాద్ లో ఉండే చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ స్ట్రీట్ లో ఒక్కసారైనా ఫుడ్ టేస్ట్ చేసే ఉంటారు. ఆ స్ట్రీట్ లో ఫుడ్ ఎంత ఫేమస్సో.. అక్కడ కుమారి కూడా అంతే ఫేమస్. మధ్యాహ్నం గడియారంలో 12 గంటలు కొట్టగానే అక్కడకి జనాలు గుమికూడతారు. కుమారి ఫుడ్ తీసుకుని ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఈమె దగ్గర వెజ్, నాన్ వెజ్ రెండురకాల ఫుడ్స్ ఉంటాయి. అయితే వెజ్ కంటే కూడా నాన్ వెజ్ కు చాలా మంచి డిమాండ్ ఉంటుంది. ఎంత అంటే మధ్యాహ్నం 2 గంటలు అయ్యే సరికి అక్కడ నాన్ వెజ్ కూరలు సగానికి సగం అయిపోతాయి.
ఆవిడ చేతివంటకు ఆ ఏరియాలో అంత డిమాండ్ ఉంటుంది మరి. వాళ్ల దగ్గర నాన్ వెజ్ లో అయితే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ లివర్, ప్రాన్స్, మటన్ కర్రీ, మటన్ లివర్, బోటీకూర, తలకాయ కూర, ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీలు ఉంటాయి. వెజ్ లో అయితే చట్నీ, పప్పు, ఫ్రై, కర్రీ, సాంబారు, పెరుగు ఉంటాయి. వీళ్లు వంటలు అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటారు. ఇంత మంచి టేస్ట్ ఎందుకు వస్తాయని అడిగితే వాళ్ల సీక్రెట్ ని చెప్పారు. వాళ్లు వంటల్లోకి కావాల్సిన అన్ని మసాలాలను ఇంటి వద్దే తయారు చేస్తారు. ఇంట్లో వాళ్లే కలిసి వంట చేస్తారు. అందుకే వీరికి ఇంత గొప్ప ఆదరణ లభిస్తోంది.
ఇంక నెగిటివీటి విషయానికి వస్తే.. కుమారి చాలా ఫేమస్ కాబట్టి ఆవిడను ఎప్పుడూ ఎవరో ఒకరు వీడియోలు అడుగుతూనే ఉంటారు. ఆవిడ కూడా నవ్వుతూ వీడియోలో సమాధానాలు చెపుతూ ఉంటుంది. అలాగో ఒక వీడియే చేస్తున్న సమయంలో కర్రీస్ కి సంబంధించిన ధరలను చెప్పుకొచ్చింది. ఒక కస్టమర్ బిల్ రూ.1000 అయ్యింది. అతడిని పిలిచి మీది థౌజెండ్ అయ్యింది.. 2 లివర్స్ ఎక్స్ ట్రా అని చెప్పారు. ఇంకేముంది మీమర్స్ అంతా ఆ వీడియోను ఆధారంగా చేసుకుని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. గతంతో పోలిస్తే ఆ ట్రోలింగ్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం మార్కెట్ లో నాన్ వెజ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. ఒక గుడ్డే రూ.7 పలుకుతోంది. ఇంక అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇలా చెప్పుకుంటూపోతే అన్నింటి ధరలు గూబ గుయ్యిమనేలాగే ఉన్నాయి.
గతంలో ఎంత తక్కువ ధరకు అమ్మినా కూడా.. ఇప్పుడు మాత్రం స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరూ ధరలను పెంచేస్తున్నారు. రుచిగా, సుచిగా ఆహారం కావాలంటే కాస్త ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ట్రోలింగ్, నెగిటివిటీని పక్కన పెడితే ఆవిడను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ తన కుటుంబ సహకారంతో ఇలాంటి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయడమే కాకుండా.. ఇప్పుడు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. కుమారి నెల సంపాదన గురించి ఇప్పుడు ట్రోల్ చేసినవాళ్లే గొప్పగా చెబుతున్నారు. ఆవిడ నెలకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు. లైఫ్ లో ఇది నిజంగా ఆవిడ సాధించిన సక్సెస్ అనే చెప్పాలి. ఈ విషయం తెలిసిన తర్వాత నెటిజన్స్ కూడా కుమారి మీద, ఆవిడ సక్సెస్ స్టోరీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆవిడ ఎంతో మందికి ఇన్ స్పిరేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కుమారి సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.