Hyderabad: నా భార్య కొడుతుంది.. ప్లీజ్‌ నన్ను కాపాడండి.. వేడుకున్న ప్రొఫెసర్‌!

నా భార్య బారి నుంచి నన్ను కాపాడండి.. లేకపోతే తను నన్ను చంపేస్తుంది.. ఈ విషయంలో పోలీసులు కూడా నాకు సాయం చేయడం లేదు.. అంటూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ వివరాలు..

నా భార్య బారి నుంచి నన్ను కాపాడండి.. లేకపోతే తను నన్ను చంపేస్తుంది.. ఈ విషయంలో పోలీసులు కూడా నాకు సాయం చేయడం లేదు.. అంటూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ వివరాలు..

గృహహింస కేసుల్లో ఎక్కువ భాగం బాధితులు మహిళలే ఉంటారు. భర్త, అత్తమామల చేతుల్లో హింసకు గురవుతున్న మహిళలకు రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వాలు గృహహింస నిరోధక చట్టాలు తీసుకువచ్చాయి. అయితే నేటి కాలంలో వీటిని దుర్వినియోగం చేసే వారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. పైగా మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. గృహ హింస బాధితుల్లో మగవారు ఉండటం విశేషం. భార్య, అత్తమామల చేతిలో బాధలు పడుతున్న మగవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.

తాజాగా యూపీలో ఓ మహిళ తన భర్తను తాళ్లతో కట్టేసి చిత్ర హింసలు పెట్టిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక భార్యాబాధితుల జాబితాలోకి ఓ హైదారాబాదీ చేరాడు. నా భార్య నన్ను కొడుతుంది.. చంపేస్తానంటుంది.. ప్లీజ్‌ కాపాడండి.. ఈ విషయంలో పోలీసులు కూడా సాయం చేయడం లేదు.. అంటూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు ఓ ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌. ఆ వివరాలు..

తన భార్య వల్ల తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ.. ఓ ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌ మీడియా ముందు తన బాధను తెలిపాడు. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజోలు ప్రాంతానికి చెందిన టెమూజియన్ అనే వ్యక్తికి అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం టెమూజియన్‌.. మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో భార్యతో కలిసి అల్వాల్‌లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన నాటి నుంచి తన భార్య.. తనను అకారణంగా హింసిస్తుందని చెప్పుకొచ్చాడు. దీని గురించి పంచాయతీ పెట్టి.. మాట్లాడినా.. ఆమె తీరులో మార్పు రాలేదని చెప్పుకొచ్చాడు. పైగా ఇటీవల.. ఓ సారి తనను చంపేదుంకు కత్తితో దాడి చేసినట్లు వెల్లడిస్తూ.. కన్నీరు పెట్టుకున్నాడు టెమూజియన్‌.

అయితే భార్య తీరుపై స్థానికంగా ఉండే అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో తాను ఫిర్యాదు చేశానని.. కానీ ఆ పోలీసులు కేసు ఫైల్‌ చేయకుండా.. నిర్లక్ష్యం వహిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. బాధితుల విషయంలో ఆడా, మగా అనే తేడా ఉంటుందా.. ఇలాంటి ఘటనల్లో మహిళలకు ఓ న్యాయం.. మగవాళ్లకు ఓ న్యాయం ఉంటుందా.. నొప్పి ఎవరికైనా ఒకటే కదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను నిన్నటి నుంచి ఇంటికి వెళ్లలేదని.. వెళ్తే.. తన భార్య మళ్లీ తన మీద దాడి చేస్తుందని.. ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉందని చెప్పుకొచ్చాడు. తన భార్యపై కేసు నమోదు చేసి.. తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నాడు.

Show comments