నిమజ్జనం వేళ ఈ తప్పులు చేయవద్దు! పోలీసుల కీలక మార్గదర్శకాలు!

Hyderabad: మరో మూడు రోజుల్లో నగరంలోని గణేశ్ నిమర్జన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే నిమర్జన వేడుకల్లో ఈ నిబంధనలు, సూచనలు కచ్చితంగా పాటించాలని తాజాగా హైదరాబాద్ నగర పోలీసులు పేర్కొన్నారు.

Hyderabad: మరో మూడు రోజుల్లో నగరంలోని గణేశ్ నిమర్జన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే నిమర్జన వేడుకల్లో ఈ నిబంధనలు, సూచనలు కచ్చితంగా పాటించాలని తాజాగా హైదరాబాద్ నగర పోలీసులు పేర్కొన్నారు.

నగరంలో గతవారం రోజులగా గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నాడు లేని విధంగా ప్రతి వీధిలోన్ను ఆ గణనాథుడు కొలువుదీరున్నాడు. ఈ క్రమంలోనే.. ఏ నోట విన్నా.. ఏ చోట చూసినా గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి. అయితే మరో మూడు రోజుల్లో ఈ వినాయక నవారాత్రలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆ గణనాథుడుని నిమర్జనం చేసే ప్రక్రియపై తాజాగా హైదరాబాద్ నగర పోలీసులు నేడు (శుక్రవారం 13-9-2024) కీలక మార్గదర్శకాలను సూచించారు. ఈ మేరకు శోభాయాత్రకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలను, సూచనలను సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. మరి, ఆ నిబంధనలు, సూచనలేమిటో తెలుసుకుందాం.

మరో మూడు రోజుల్లో నగరంలోని గణేశ్ నిమర్జన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమయంలో గణనాథుడి విగ్రహాలను తీసుకెళ్లే ఉత్సవ కమిటీ పాటించాల్సిన నిబంధనలు, సూచనలను ముందుగానే హైదరాబాద్ నగర పోలీసులు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు ఎక్స్ వేదికగా పోస్ట్ ను కూడా షేర్ చేశారు. అయితే అందులో గణనాథుడి విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే నిమజ్జనం రోజున సౌత్ జోన్ పరిధిలో విగ్రహాలను తీసుకెళ్లేవారు ముందుగానే బయలుదేరాలని, వాహనానికి ఏసీపీ కేటాయించిన నంబర్‌ను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. మరోవైపు, హైకోర్టు ఆదేశాలతో ట్యాంక్ బండ్‌పై విగ్రహాల నిమజ్జనానికి అనుమతిలేదని కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.

ఇకపోతే గణనాథుని విగ్రహాం తీసుకెళ్లేందుకు ఒక వాహనం మాత్రమే అనుమతి ఉందని, అలాగే విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ ను ఏర్పాటు చేయరాదని పేర్కొన్నారు. దీంతో వాహనాలపై డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టమ్‌కు అనుమతి లేదని, రంగులు, కాన్ఫెట్టి తుపాకుల వాడకం నిషేధమని తెలిపారు. అంతేకాకుండా.. విగ్రహాన్ని తీసుకెళ్తే వాహనంలో మద్యం,ఇతర మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులకు అనుమతి ఉండదు. ముఖ్యంగా నిమర్జనం రోజున విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనం ఇతర వాహనాలకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ఏదైనా ప్రార్థనా స్థలం వంటి మార్గంలో నిలపరాదు. అయితే ఆ రోజున పరిస్థితులు బట్టి పోలీసులు ఇచ్చే ఆదేశాల మేరకు వాహనాల కదలికలు ఆధారపడి ఉంటాయి. ఇక వీటితో పాటు ఊరేగింపులో కర్రలు,కత్తులు, కాల్పులు ఆయుధాలు, మండే పదార్థాలు, ఇతర ఆయుధాలను వెంట తీసుకురాకూడదు.

అలాగే జెండాలు,అలంకరణ కోసం ఉపయోగించే కర్రలు 2 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉండరాదు. వెర్మిలియన్, కుంకుమ లేదా గులాల్‌లను రోడ్డుపై వెళ్లేవారిపై చల్లరాదు. ముఖ్యంగా ఎలాంటి రాజకీయ, రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు, బ్యానర్లు ఉపయోగించరాదు. ఏ వర్గానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే ఇతర చర్యలకు పాల్పడరాదు. ఇక ఊరేగింపు సమయంలో బాణాసంచాపై పూర్తి నిషేధం ఉంటుందని, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలను పాటించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని మార్గదర్శకాల్లో పోలీసులు తెలిపారు. అయితే ఈసారి గణేశ్ నిమర్జన వేడుకల్లో హైదరాబాద్ నగరంలో మొత్తం 15 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో విగ్రహాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. మరీ, గణేశ్ నిమర్జన వేడుకలకు హైదరాబాద్ నగర పోలీసులు జారీ చేసే నిబంధనలను, సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments