Hyderabad Charminar Clock Damaged: 135 ఏళ్ల చరిత్రకు గాయం.. పగిలిన చార్మినార్‌ గడియారం

Charminar: 135 ఏళ్ల చరిత్రకు గాయం.. పగిలిన చార్మినార్‌ గడియారం

Hyderabad Charminar Clock Damaged: హైదరాబాద్‌ నగరానికే తలమానికంగా నిలిచిన చార్మినార్‌కు గాయం అయ్యింది. అసలేం జరిగిందంటే..

Hyderabad Charminar Clock Damaged: హైదరాబాద్‌ నగరానికే తలమానికంగా నిలిచిన చార్మినార్‌కు గాయం అయ్యింది. అసలేం జరిగిందంటే..

చార్మినార్‌.. హైదరాబాద్‌ నగరానికే తలమానికంగా నిలుస్తుంది. ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ కట్టడాన్ని నిర్మించారు. కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఐదవ పాలకుడు ముహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఇప్పటికి హైదరాబాద్‌ అనగానే మనకే కాదు.. విదేశీయులకు సైతం చార్మినార్‌ పేరే గుర్తుకు వస్తుంది. చారిత్రాత్మక కట్టడంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక చార్మినార్‌ అనగానే మనకు షాపింగ్‌, ముత్యాలు వంటివి గుర్తుకు వస్తాయి. రాత్రి పూట చార్మినార్‌ అందాలను చూడటానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. వీకెండ్స్‌లో చాలా మంది చార్మినార్‌ అందాలను చూడటానికి ఎక్కువగా తరలి వెళ్తుంటారు. ఇక రంజాన్‌ మాసంలో చార్మినార్‌ దగ్గర ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇసుకవేస్తే రాలనంతగా జనాలు ఇక్కడకు తరలి వస్తారు. మరి మన దేశంలోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా చార్మినార్‌ చారిత్రత్మక కట్టడంగా గుర్తింపు తెచ్చుకుంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న చార్మినార్‌కు తాజాగా గాయం అయ్యింది. ఆ వివరాలు..

చార్మినార్ కే కాదు, దాని మీదున్న గడియారాలకు కూడా ఘన చరిత్ర ఉంది. చార్మినార్‌ నిర్మాణం జరిగింది 1591లో అయితే.. దాని మీద 1889లో చార్మినార్‌కు నలువైపులా గడియారాన్ని అమర్చారు. 135 ఏళ్ళ చరిత్ర ఉన్న గడియారం ధ్వంసమైంది. చార్మినార్‌కు మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో ఇనుప పైప్ తగిలి గడియారం ధ్వంసమయినట్లుగా తెలుస్తోంది. అయితే, గడియారం పాక్షికంగానే ధ్వంసం కావడంతో ఇంకా పని చేస్తోంది. మరి, 135ఏళ్ళ చరిత్ర ఉన్న పురాతన గడియారాన్ని మర్చి కొత్తది అమర్చుతారా లేక దానికే రిపేర్ చేస్తారా అన్నది వేచి చూడాలి.

ఇక చార్మినార్‌ ప్రాంతానికి ఈశాన్యంలో లాడ్ బజార్, పడమరన గ్రానైటుతో చక్కగా నిర్మించబడిన మక్కా మసీదు ఉన్నాయి. చార్మినార్‌ పనులు పూర్తయిన మరుసటి ఏడాదే అనగా 1592లో చార్మినార్‌కు నాలుగు వైపులా కమాన్‌లు నిర్మించారు. చార్మినార్ కమాన్‌, కాలీ కమాన్‌, మచిలీ కమాన్‌, షేర్‌ ఏ బాతుల్‌ పేరిట 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్‌ పద్ధతిలో ఈ కమాన్‌లను నిర్మించారు. ఇది పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసిన అధికారిక “కట్టడాల జాబితా ” లో పురావస్తు, నిర్మాణ నిధిగా చేర్చారు.

Show comments