ఘోర ప్రమాదం.. హైటెక్​ సిటీ ఫ్లైఓవర్​ పైనుంచి పడి యువతి మృతి!

  • Author singhj Published - 08:15 AM, Fri - 18 August 23
  • Author singhj Published - 08:15 AM, Fri - 18 August 23
ఘోర ప్రమాదం.. హైటెక్​ సిటీ ఫ్లైఓవర్​ పైనుంచి పడి యువతి మృతి!

ప్రభుత్వాలు ఎంతగా కృషి చేస్తున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వీటిలో అత్యధికం మితిమీరిన వేగం వల్లే జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇక, తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక యాక్సిడెంట్ చోటుచేసుకుంది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కింద పడటంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కోల్​కతాకు చెందిన స్వీటీ పాండే (22) అనే యువతి.. స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలసి జేఎన్​టీయూ నుంచి హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీదుగా ఐకియా వైపు టూ వీలర్​పై వెళ్తున్నారు.

స్వీటీ ఫ్రెండ్ ల్యుకే వాహనాన్ని అతి వేగంగా నడపడంతో అది కాస్తా అదుపు తప్పి హైటెక్​ సిటీ ఫ్లైఓవర్​ పైగోడను ఢీ కొట్టింది. దీంతో స్కూటీ వెనుక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా ఎగిరి కింద పడిపోయింది. మరోవైపు ల్యుకే కూడా గోడను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన అక్కడివారు వాళ్లిద్దర్నీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూనే స్వీటీ పాండే మృతి చెందింది. తీవ్ర గాయాలపాలైన రాయల్ ల్యుకే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదిలా ఉంటే.. గత నెలలో ఇలాంటి ఓ ఘటనే వెలుగుజూసింది. గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి ఒక వాహనదారుడు కిందపడ్డాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే రోజు రాత్రి ఇద్దరు యువకులు టూ వీలర్ పై ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నారు. వాళ్లు వేగంగా వెళ్లి డివైడర్​ను ఢీకొట్టారు. దీంతో ఒక ఫ్లైఓవర్ పైనుంచి మరో ఫ్లైఓవర్ పైన వాళ్లు పడ్డారు. ఈ ఘటనలో బైక్ పైన వెళ్తున్న ఇద్దరిలో ఒకరు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Show comments