iDreamPost
android-app
ios-app

Hyderabad: పంజాగుట్టలో కారు బీభత్సం! అడ్డొచ్చినవారిని ఢీ కొడుతూ..

  • Published Jan 27, 2024 | 7:30 AM Updated Updated Jan 27, 2024 | 7:38 AM

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగిన హిట్ అండ్ రన్ కేసు మరచిపోకముందే.. భాగ్యనగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగిన హిట్ అండ్ రన్ కేసు మరచిపోకముందే.. భాగ్యనగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది.

  • Published Jan 27, 2024 | 7:30 AMUpdated Jan 27, 2024 | 7:38 AM
Hyderabad: పంజాగుట్టలో కారు బీభత్సం! అడ్డొచ్చినవారిని ఢీ కొడుతూ..

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగిన హిట్ అండ్ రన్ కేసు మరచిపోకముందే.. భాగ్యనగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు అడ్డువచ్చిన వారిని ఢీ కొడుతూ.. వెళ్లింది. స్థానికులు ఆ కారును వెంబడించి, దానిని నడుపుతున్న వ్యక్తిని చితకబాదారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు నగరంలో తరచుగా జరుగుతున్నాయి.

ట్రాఫిక్ పోలీసులు వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలని ఎంత చెప్పినా.. కొందరు చెవిన పెట్టరు. దీంతో వారి నిర్లక్ష్యం ఎదుటివారి ప్రాణాలను బలిగొంటుంది. ఇటీవల జూబ్లీహిల్స్ లో జరిగిన హిట్ అండ్ రన్ కేసే ఇందుకు నిదర్శనం. తాజాగా నగరంలో మరోసారి కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ.. అడ్డువచ్చిన వారిని ఢీ కొంటూ వెళ్లాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు ఆ కారును వెంబడించారు. అందులోని వ్యక్తిని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఈ సంఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. కారు డ్రైవ్ చేసిన వ్యక్తికి తగిన బుద్ది చెప్పిన తర్వాత.. అతడిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet