P Krishna
High Court : ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కి పార్టీ ఏకంగా పదేళ్ల పాటు పాలన కొనసాగించింది. అనూహ్యంగా ప్రజా వ్యతిరేకత రావడంతో గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యింది.
High Court : ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కి పార్టీ ఏకంగా పదేళ్ల పాటు పాలన కొనసాగించింది. అనూహ్యంగా ప్రజా వ్యతిరేకత రావడంతో గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యింది.
P Krishna
గత ఏడాది నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు పాలన కొనసాగింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇది చాలదు అన్నట్లు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెల్చుకోలేకపోయింది. అయితే ప్రజా తీర్పును తాము ఎప్పటికీ గౌరవిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ అంటున్నారు. ప్రజా పక్షాణ అధికార పార్టీపై పోరాటం చేస్తామని అంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగింది? హైకోర్టు ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చింది? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
నల్లగొండ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం 15 రోజులు గడువు కూడా విధించింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి రూ.లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. ఆఫీస్ నిర్మించిన తర్వాత అనుమతి ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది.తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయకుండా ఆపాలంటూ పెట్టిన పిటీషన్ ని కొట్టివేసింది. నల్లగొండ టౌన్ లో హైదరాబాద్ రోడ్డు పక్కన ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్, రేటు ఉంది. ఇక్కడ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు చెందిన భూమిలోని ఎకరా స్థలాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధకిరాలో ఉన్నపుడు ఏడాదికి కేవలం రూ.100 కే లీజ్ కు తీసుకుంది. అక్కడ బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించింది.
నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను అక్రమంగా ఎలాంటి పరిమిషన్ తీసుకోకుండా నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇక తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కూల్చి వేతల పనులు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో ఇప్పటికే ‘హైడ్రా’ పేరు చెబితే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ క్రమంలోనే అక్రమంగా ఆక్రమించి కట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అధికారులకు కూల్చి వేయాలని ఆగస్టు 11 వరకు అధికారులకు డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ద వాతావరణం నడిచింది.
ఇదిలా ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంటకట్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ హై కోర్టును ఆశ్రయించింది. ఈ పీటీషన్ పరిశీలించిన ధర్మాసనం, పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతి ఇస్తారని సూటిగా ప్రశ్నించింది. ఎవరైనా నిర్మాణం కట్టక ముందు అనుమతి తీసుకుంటారు అని ప్రశ్నించినట్లు సమాచారం. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.