iDreamPost
android-app
ios-app

కుమారీ ఆంటీకి హీరో సందీప్ కిషన్ మద్దతు..

  • Published Jan 30, 2024 | 10:33 PM Updated Updated Jan 30, 2024 | 10:33 PM

Sandeep Kishan Supports Kumari Aunty: హైదరాబాద్ లో ఫుడ్ సెంటర్‌ నడుపుతున్న కుమారి ఆంటీకి ఈ మద్య బాగా పబ్లిసిటి వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఆమె పుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి ట్రక్కును సీజ్ చేశారు పోలీసులు.. దీంతో ఆమెకు పలువురు మద్దతు ఇస్తున్నారు.

Sandeep Kishan Supports Kumari Aunty: హైదరాబాద్ లో ఫుడ్ సెంటర్‌ నడుపుతున్న కుమారి ఆంటీకి ఈ మద్య బాగా పబ్లిసిటి వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఆమె పుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి ట్రక్కును సీజ్ చేశారు పోలీసులు.. దీంతో ఆమెకు పలువురు మద్దతు ఇస్తున్నారు.

  • Published Jan 30, 2024 | 10:33 PMUpdated Jan 30, 2024 | 10:33 PM
కుమారీ ఆంటీకి హీరో సందీప్ కిషన్ మద్దతు..

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. కొంతమంది పాపులర్ కావడం కోసం ఎన్నో రకాలుగా కష్టపడుతుంటారు కానీ.. అదృష్టం కలిసి రాదు. అదృష్టం బాగుండి కొంతమంది రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్లు ఉన్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా కొంతమంది యూట్యూబర్స్ రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే వారి వద్దకు వెళ్లి వీడియోలు తీస్తూ వైరల్ చేస్తున్నారు. మంచి టేస్టీ ఫుడ్ లభిస్తుందని తెలియగానే జనాలు అక్కడికి వెళ్లి ఫుట్ టేస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. కొంతమంది వ్యాపారులకు ఇది మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. హైదరాబాద్ లో ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ కి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.. ఆమె ఫుడ్ సెంటర్ నిర్వహనపై ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే కుమారి ఆంటీకి పలువరు మద్దతు ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

జూబ్లీహిల్స్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఫుడ్ సెంటర్ పెట్టుకొని జీవనం సాగిస్తుంది. తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఫుడ్ రుచికరంగా అందించడంతో ఆమె గిరాకి దినినాభివృద్ది అయ్యింది. అంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవల కుమారి ఆంటీని పలువురు యూట్యూబర్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రెటీలు సైతం కుమారి ఆంటి వద్దకు వెళ్లిఅక్కడి ఫుడ్ తిని మెచ్చుకున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే ఆమె కొంప ముంచిందని అంటున్నారు. కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు.. కేసు కూడా పెట్టే పరిస్థితికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు పలువురు మద్దతు ఇస్తున్నారు.

కుమారి ఆంటీ గురించి తెలిసిన హీరో సందీప్ కిషన్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇటీవల ఊరిపేరు భైరవకోన సినిమా ప్రమోషన్ సందర్భంగా తన బృందంతో కలిసి కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ కి వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి చాలా బాగుందని మెచ్చుకున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి కుమారి ఇంటీ మరింత పాపులర్ అయ్యింది. తాజాగా కుమారి ఆంటీ పరిస్తితి గురించి తెలుసుకున్న సందీప్ కిషర్ ట్విట్టర్ వేధికగా ఆమెకు మద్దతు తెలిపారు. ‘ ఆమె చాలా మంది మహిళలకు ప్రేరణ, సొంతంగా వ్యాపారం చేసుకుంటూ తన జీవితం పోషించుకుంటుంది. ఈ మధ్య కాలంలో నేను చూసిన గొప్ప మహిళా సాధికారత ఉదాహరణలలో ఇది ఒకటి. ఆమెకు నేను, నా టీమ్ అండగా ఉంటాం’ అంటూ ట్వీట్ చేశారు.ఊరిపేరు భైరవకోన  మూవీ ఫిబ్రవరి 16 న రలీజ్ కాబోతుంది.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet