iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి సాయంత్రం భారీ వర్షం!

Rain Alert For Hyderabad: గత కొద్ది రోజుల నుంచి వానలతో హైదరాబాద్ నగర వాసులు అల్లాడిపోతున్నారు. అలానే శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో నగరం వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో తాజాగా నగర వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ ను ఇచ్చింది.

Rain Alert For Hyderabad: గత కొద్ది రోజుల నుంచి వానలతో హైదరాబాద్ నగర వాసులు అల్లాడిపోతున్నారు. అలానే శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో నగరం వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో తాజాగా నగర వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ ను ఇచ్చింది.

హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి సాయంత్రం భారీ వర్షం!

కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే పలు ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయి హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ అల్పపీడనం వాయుగుండం మారి బలపడుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాసులకు ఐఎండీ బిగ్ అలెర్ట్ ఇచ్చింది. శనివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది.

తెలంగాణ ప్రజలకు హైదారాబాద్ వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్ ఇచ్చింది. శనివారం సాయంత్రం భారీ వర్షం కురవనున్నట్లు తెలిపింది. ఇదేసమయంలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది నేటి సాయంత్రం హైదరాబాద్‌ను కూడా భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉందంటూ ఐఏండీ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఇక భారీ వానలు పడితే ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్ నగరంలో చినుకు పడితే చాలు.. ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  అలానే చాలా ప్రాంతాలు జలమయ్యం అవుతున్నాయి. శుక్రవారం నుంచి ఎడతెరపి లేకుండా తేలిక పాటి వాన కురుస్తుంది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలకే నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా శనివారం సాయంత్రం కూడా భారీ వాన కురవనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేటి సాయంత్రం అత్యవసరం అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలకు కూడా ఐఎండీ బిగ్ అలెర్ట్ ఇచ్చింది.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలలుక ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. రెండు నుంచి మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురుసే అవకాశం ఉందని సూచించింది. మరోవైపు బలమైనా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలానే చెరువులు, కుంటలు నిండిపోయాయి. మొత్తంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ తాజా ప్రకటనతో జీహెచ్ఎంసీ అప్రమత్తమయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి