iDreamPost

చికిత్స పేరుతో వైద్యుల దారుణాలు.. ఏంటో తెలిస్తే.. ఛీ అనకమానరు!

Telangana: ఈ మధ్యకాలంలో అనేక ఫేక్ ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయి. అలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న క్లినిక్ లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొరడ ఝులిపిస్తుంది. తాజాగా తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Telangana: ఈ మధ్యకాలంలో అనేక ఫేక్ ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయి. అలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న క్లినిక్ లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొరడ ఝులిపిస్తుంది. తాజాగా తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చికిత్స పేరుతో వైద్యుల దారుణాలు.. ఏంటో తెలిస్తే.. ఛీ అనకమానరు!

ప్రతి ఒక్కరు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. ఆస్పత్రికి వెళ్తుంటారు. డబ్బు ఉన్నవాళ్లు పెద్ద హాస్పిటల్ వెళ్లి చికిత్స చేయించుంటారు. అలానే పేద వారు చిన్న చిన్న దావఖానాలకు వెళ్తుంటారు. ఇదే సమయంలో అనేక ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిని నిర్వహించే వారిలో ఎంతమందికి అర్హత ఉందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలోనే తరచూ వైద్య మండలి అధికారులు ఆస్పత్రులపై తనిఖీలు చేస్తుంటారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చిన్నపాటి క్లినిక్స్, ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా చికిత్స పేరుతో కొందరు వైద్యులు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. అసలు నిజాలు తెలిసి..స్థానికులు షాకవుతున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఈ మధ్యకాలంలో అనేక ఫేక్ ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయి. అలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న క్లినిక్ లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొరడ ఝులిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసిన వైద్యాధికారులు తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు చేశారు. నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ టాస్క్ ఫోర్స్ టీం..వాటికి సరైన అర్హత లేదని గుర్తించారు. అంతేకా ఆ నాలుగు ఆస్పత్రులను సీజ్ చేసి.. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. జిల్లా శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలంలోని  ప్రైయివేట్ క్లినిక్‎లపై వైద్య అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఆస్పత్రులు నిర్వహిస్తున్న వారి అర్హతలు చూసి అధికారులు అవాక్కయ్యారు.

ఎలాంటి అర్హత లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తూ రోగులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో వైద్యం నిర్వహిస్తున్నారు. నకిలీ డాక్టర్లుగా గుర్తించి.. వీరి క్లినిక్‎లను సీజ్ చేసి,  వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అధికారుల తనిఖీ కి వస్తున్నారు అనే విషయాన్ని ముందే పసిగట్టిన ముగ్గురు క్లినిక్‎ల నిర్వాహకులు ముందే పరారయ్యారు. ఆ పరారిలో ఉన్న వారిని పట్టుకునేందుకు కూడా చర్యలు ఉంటాయని వైద్యాధికారులు తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‎లను నిర్వహించేవారు కొందరు వైద్యులుగా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అధికారులు తెలిపారు. అలాంటి వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని వైద్యాధికారులు సూచించారు.

ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ విషయంలో అధికారులు అనేక దాడులు చేసి..పలు హోటళ్లు, రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చారు. అలానే ఆర్టీఏ కార్యాలయాలపై దాడులు నిర్వహించి.. అవినీతి అధికారులను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు. వీటితో పాటు నకిలీ ఆస్పత్రులపై కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి నకిలీ ఆస్పత్రులపై దాడులు చేసి సీజ్ చేశారు. తాజాగా మహబూబాబాద్ లో ఈ కూడా వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి