HCA To Build New Stadium In Hyderabad: హైదరాబాద్​లో మరో స్టేడియం.. 100 ఎకరాల్లో నిర్మాణం! ఆ ఏరియా దశ తిరిగినట్లే!

హైదరాబాద్​లో మరో స్టేడియం.. 100 ఎకరాల్లో నిర్మాణం! ఆ ఏరియా దశ తిరిగినట్లే!

Hyderabad: హైదరాబాద్ క్రికెట్ లవర్స్​కు గుడ్ న్యూస్. నగరంలో మరో స్టేడియం నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

Hyderabad: హైదరాబాద్ క్రికెట్ లవర్స్​కు గుడ్ న్యూస్. నగరంలో మరో స్టేడియం నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో ఓ క్రికెట్ స్టేడియం ఉన్న సంగతి తెలిసిందే. నగరంలోని ఉప్పల్​లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్నో మ్యాచులు జరిగాయి. టీమిండియా ఆడే మ్యాచులతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచులకు కూడా ఈ స్టేడియం ఆతిథ్యం ఇస్తూ వస్తోంది. అలాగే రంజీ, లీగ్ మ్యాచులు కూడా ఇందులో జరుగుతాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్​సీఏ) ఈ స్టేడియం నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. వరల్డ్ కప్ మ్యాచులకు కూడా ఆతిథ్యం ఇచ్చిన ఘనత ఈ స్టేడియానికి ఉంది. అయితే ఈ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ (38 వేలు) తక్కువగా ఉండటంతో ఐపీఎల్ మ్యాచుల టైమ్​లో సమస్యలు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్​లో నూతన స్టేడియం నిర్మించనున్నారు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్​లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాల్లో హెచ్​సీఏ బిజీబిజీగా ఉంది. నగర శివార్లలో 100 ఎకరాల్లో కనీవినీ ఎరుగని రీతిలో స్టేడియాన్ని కట్టనున్నారు. లక్ష సీటింగ్ కెపాసిటీతో అధునాతన సౌకర్యాలతో నూతన స్టేడియాన్ని నిర్మించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విషయాన్ని హెచ్​సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటు రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాల్లో మినీ స్టేడియాలను కూడా నిర్మించనున్నామని ఆయన చెప్పారు.

కొత్త స్టేడియంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణానికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. స్టేడియాల నిర్మాణ ప్రక్రియలో భాగంగా తొలుత భూముల సేకరణ చేపడతామన్నారు. భూముల సేకరణ పూర్తయితే బీసీసీఐ నుంచి నిధులు విడుదలవుతాయని వివరించారు. భూములను సర్కారు నుంచి లీజుకు తీసుకోకుండా హెచ్​సీఏ తరఫున కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గవర్నమెంట్ నుంచి భూములు కొనుగోలు చేస్తే న్యాయపరమైన చిక్కులు రావన్నారు. ఈ విషయం మీద క్రీడా మంత్రిత్వ శాఖతో జిల్లా కలెక్టర్లు, అధికారులను సంప్రదించామన్నారు. ఇక, నగర శివార్లలో సరిగ్గా ఎక్కడ స్టేడియం నిర్మిస్తారనేది చెప్పలేదు. కానీ స్టేడియం వస్తే మాత్రం ఆ ఏరియా దశ తిరగడం ఖాయమని నిపుణులు అంటున్నారు.

Show comments