iDreamPost
android-app
ios-app

డిప్యూటీ MRO చెంప చెల్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా?

  • Published Apr 18, 2024 | 4:27 PM Updated Updated Apr 18, 2024 | 4:27 PM

Woman Slapped Deputy MRO: ఇటీవల మహిళల పట్ల కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు అత్యాచారాలకు తెగబడుతున్నారు. దేశంలో నిత్యం ఇలాంటి కేసులు పదుల సంఖ్యల్లో నమోదు అవుతున్నాయి.

Woman Slapped Deputy MRO: ఇటీవల మహిళల పట్ల కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు అత్యాచారాలకు తెగబడుతున్నారు. దేశంలో నిత్యం ఇలాంటి కేసులు పదుల సంఖ్యల్లో నమోదు అవుతున్నాయి.

డిప్యూటీ MRO చెంప చెల్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా?

ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక రకంగా ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లేందుకు భయంతో వణికిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవ్వరినీ వదలడం లేదు కామాంధులు. దేశంలో ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా వీరిలో మార్పు రావడం లేదు. దారుణం ఏంటంటే కొంతమంది చదువుకున్న మూర్ఖులు కూడా ఒంటరిగా కనిపించే ఆడవాళ్లపై లైంగిక వేధింపులకు పాల్పపడుతున్నారు. డిప్యూటీ తహసీల్దార్  ఒంటరిగా కనిపించిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తగిన బుద్ది చెప్పింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ పట్టణంలో ఓ ఇంట్లో డిప్యూటీ ఎమ్మార్వో నివాసం ఉంటున్నాడు. అతను ఉంటున్న నివాసం పక్క పోర్షన్ లో కుటుంబం నివసిస్తుంది. మహిళ బట్టలు ఆరేస్తున్న సమయంలో సదరు డిప్యూటీ తహసీల్దార్ కుర్చిలో కూర్చొని ఆమె పట్ల అభ్యంగా వప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఆ మహిళకు తెలియకుండా తన సెల్ ఫోన్ తో ఫోటోలు, వీడియోలు తీయడం గమనించి మహిళ అతని వద్దకు వచ్చి ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించింది. దానికి అతను దురుసుగా సమాధానం చెప్పడంతో చెంప ఛెల్లుమనిపించింది. అనంతరం భర్తకు సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె భర్త సదరు డిప్యూటీ తహసీల్దార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఒంటరిగా కనిపించే మహిళల పట్ల పోకిరీలు, ఆకతాయిలు లైంగిక వేధింపులకు పాల్పపడటం చూస్తున్నాం.. కానీ ఈ మధ్య చదువుకున్న వాళ్లు, సమాజంలో మంచి గౌరవమైన స్థానంలో ఉన్న వాళ్లు సైతం వేధింపులకు గురి చేయడం సమాజం తలగించుకోవాల్సిన విషయం అని అంటున్నారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు డిప్యూటీ తహశీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో మంచి పొజీషన్ లో ఉంటూ ఆడవాళ్లపై అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడికి ఆ మహిళ తగిన గుణపాఠం చెప్పిందని అంటున్నారు.