విద్యార్థులకు గుడ్ న్యూస్.. 15 నుంచి ఒంటిపూట బ‌డులు..!

Half Day Schools in the State: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Half Day Schools in the State: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి మూడో వారం నుంచి ఎండలు మండుతున్నాయి. ఒకటీ రెండు రోజులు వాతావరణం కాస్త చల్లబడినా.. మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మార్చి నెలలోనే ఉండలు ముదిరిపోవడంతో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఏ సమయంల నుంచి ఏ సమయం వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలి? పదో తరగతి పరీక్షలు కేంద్రాల్లో ఏ సమయంలో పాఠశాల నిర్వహించాలి? అన్న విషయాలపై కీలక ప్రకటన చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో గత వారం రోజుల నుంచి ఎండలు మండిపోతున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచే ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పది రోజుల నుంచి రాష్ట్రంలో  ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి.. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలకు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుంది.  ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ఉంటాయని వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పాఠశాలలు పనిచేయాలని విద్యాశాఖ అదికారులు ఆదేశించారు.

తెలంగాణలో వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టిన తర్వాత విద్యార్థులను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. 10 తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూట నుంచి పాఠశాలలు నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. ప్రైవేట్ స్కూల్స్ తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించలని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

Show comments