Arjun Suravaram
గెలుపు అనేది పదం వినడాని, చదవడానికి మూడు అక్షరాలు మాత్రమే. కానీ దానిని అందుకోవడం మాత్రం అంత ఈజీకాదు. కారణం.. ఆ విజయం రుచి ఆస్వాదించాలంటే.. ఎన్నో కష్టాలు పడాలి, పట్టుదలతో శ్రమించాలి
గెలుపు అనేది పదం వినడాని, చదవడానికి మూడు అక్షరాలు మాత్రమే. కానీ దానిని అందుకోవడం మాత్రం అంత ఈజీకాదు. కారణం.. ఆ విజయం రుచి ఆస్వాదించాలంటే.. ఎన్నో కష్టాలు పడాలి, పట్టుదలతో శ్రమించాలి
Arjun Suravaram
విజయం అనేది పదం వినడాని, చదవడానికి మూడు అక్షరాలు మాత్రమే. కానీ దానిని అందుకోవడం మాత్రం అంత ఈజీకాదు. కారణం.. ఆ గెలుపు రుచి ఆస్వాదించాలంటే.. ఎన్నో కష్టాలు పడాలి, పట్టుదలతో శ్రమించాలి. ముఖ్యంగా విద్యార్థులు చదువుల్లో విజయం సాధించాలంటే ప్రధానంగా ఉండాల్సి…కుటుంబం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూదనే ఆలోచన. అలానే ఓ విద్యార్థి కూడా తన అమ్మమ్మ, తాతయ్యలను పెట్టుకున్న ఆశలను నిజం చేశాడు. తన కోసం అమ్మమ్మ పడిన శ్రమను వృథా చేయకుండా.. అనుకున్నది సాధించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
మంగళవారం తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిజల్ట్స్ లో పేదింటి కుసుమాలు మెరిశాయి. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ చదువుకుని, పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించారు. ప్రభుత్వం, గురుకుల పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది పేద విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో బెస్ట్ ర్యాంకులు సాధించారు. గురుకుల పాఠశాల చదివిన విద్యార్థులు తమ సత్తా చాటారు. అలాంటి వారిలో ఒకడు జక్కని హర్షవర్ధన్.
సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అంజనీ నగర్ కు చెందిన గోవిందు దేవయ్య, దేవమ్మల మనవడు జక్కని హర్షవర్ధన్ పదవ తరగతి ఫలితాల్లో 9.8 జీపీఏ సాధించారు. వేముల వాడ పట్టణంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో హర్షవర్ధన్ పదో తరగతి చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ, అమ్మమ్మ ,తాతయ్య వాళ్ల వద్ద ఉంటూ చదువుకున్నాడు. వారు కూడా మనవడిని బాగా చదివించేందుకు కష్టపడ్డారు. మనవడికి మంచి మార్కులు రావాలని ఆ అమ్మమ్మ ఎన్నో కలలు కనేది. వారి ఆశలను, కష్టాన్ని వృధా చేయకుండా రేయింబవళ్లు కష్టపడి చదువుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 9.8 జీపీఏ సాధించాడు. ఇక తాను సాధించిన ఈ ఫలితాలపై హర్షవర్ధన్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఉపాధ్యాయులతో పాటు అమ్మమ్మ, తాతయ్య, మామయ్యల ప్రోత్సాహంతో పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించానని తెలిపాడు. తల్లిదండ్రులు దూరం ఉన్న కారణంగా.. చిన్నతనం నుంచి తన అమ్మమ్మ, తాతయ్య వద్దే ఉంటూ చదువుకుంటున్నాని తెలిపారు. తన అమ్మమ్మ, తాతయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 9.8 జీపీఏ సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడుయ. తాను భవిష్యత్ లో ఆస్ట్రాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమని, కష్టపడి చదివి తప్పక సాధిస్తానని తెలిపాడు. రోజూ గురుకుల పాఠశాల్లో ఉపాధ్యాయుల సూచనలు, సలహాల మేరకు.. అనునిత్యం చదువుతు, ప్రాక్టీస్ చేశాని తెలిపాడు. అలా ఎంతో కష్టపడి తాను మంచి గ్రేడ్ పాయింట్స్ తో ఉత్తీర్ణత సాధించానని హర్షవర్ధన్ పేర్కొన్నారు. మొత్తంగా అమ్మమ్మ కోరికను నివవేర్చిన ఈ మనవడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.