Arjun Suravaram
Gurrala Sarojanamma: ప్రస్తుతం సమాజంలో చాలా మంది తమ ఆస్తులను, డబ్బులను ఎలా పెంచుకోవాలనే దానిపైనే దృష్టి పెడుతుంటారు. అలాంటి వారికి భిన్నమైన వ్యక్తే సరోజనమ్మ. మానవత్వానికి చిరునామాగా నిల్చిన ఈ అమ్మ కథ ఇప్పుడు చూద్దాం..
Gurrala Sarojanamma: ప్రస్తుతం సమాజంలో చాలా మంది తమ ఆస్తులను, డబ్బులను ఎలా పెంచుకోవాలనే దానిపైనే దృష్టి పెడుతుంటారు. అలాంటి వారికి భిన్నమైన వ్యక్తే సరోజనమ్మ. మానవత్వానికి చిరునామాగా నిల్చిన ఈ అమ్మ కథ ఇప్పుడు చూద్దాం..
Arjun Suravaram
నేటికాలంలో ఎదుటివారికి సాయం చేయాలనే ఆలోచన చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా ఎవరి స్వార్థంతో వారు సమాజంలో పరుగులు తీస్తున్నారు. పక్కవాడు ఏదైనా ప్రమాదంలో, ఆపదలో ఉన్న కూడా తమకేమి పట్టదన్నట్లు ఉంటారు. కానీ కొందరు మాత్రం ప్రజల సేవ కోసం జీవిస్తుంటారు. అలా తోటి వారికి సాయం చేయడంలోనే తృప్తిని వెతుక్కుంటారు. ఇక మరికొందరిని చూస్తే..వీళ్లు మానవత్వానికి చిరునామాగా అనిపిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకరు 80 ఏళ్ల వయస్సున ఓ పెద్దమ్మ. ఆ పేదల వారికి, ఆపదలో ఉన్నవారికి చేసిన సాయం గురించి తెలిస్తే.. ఆశ్చర్యపడక మానరు. మరి..ఆ మాతృమూర్తి కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం సమాజంలో చాలా మంది తమ ఆస్తులను, డబ్బులను ఎలా పెంచుకోవాలనే దానిపైనే దృష్టి పెడుతుంటారు. అలాంటి వారికి భిన్నమైన వ్యక్తే సరోజనమ్మ. నిజమాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన సరోజనమ్మ తన ఆస్తినంతా పేద వారికి పంచిపెడుతుంది. ఆమె చేసే మానవ సేవకు కొలమానం లేదు. కోట్ల సంపద ఉన్న ఎందరో చేయలేని పనులను ఆ పెద్దామా చేస్తూ సామాన్యులకు దేవతల నిల్చింది. ప్రభుత్వ టీచర్ గా పని చేసిన ఆమె.. ఉద్యోగ విరమణ తరువాత వస్తున్నపెన్షన్ తో శేష జీవితం గడుపుతున్నారు. అలాగే తనకు ఉన్న మిగిలిన ఆస్తినంతా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారు.
అదె ఇంట్లో ఉండే పేద, మధ్యతరగతి ఫ్యామిలీల్లో ఎవరైనా కాలం చేస్తే ఇంటి ఓనర్లు మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. అలానే బంధువులెవరైనా దూరప్రాంతాల్లో, విదేశాల్లో ఉంటే ఆ బాడీని భద్రపర్చడం కూడా పేద కుటుంబాలకు ఆర్థిక భారమే. ఈ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదనే తన చేతిలో ఉన్న డబ్బులతో ధర్మస్థలం పేరుతో శాశ్వత భవనాన్ని సరోజనమ్మ నిర్మించారు. పై సమస్యలతో ఇబ్బంది పడే పేదలకు ఈ భవనం ద్వారా సాయం చేస్తున్నారు. ఓ సామాన్యురాలు ఈ కార్యక్రమం చేపట్టడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ధర్మస్థలం వల్ల ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతున్నది.
8 ఏళ్ల క్రితం సరోజనమ్మ భర్త వెంకట్‌రావు మరణించారు. ఒంటరిగా ఉంటున్న ఆమె ఇటీవలే తన ఇంటిని తెలంగాణ ఆల్ పింఛనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్‌కు విరాళంగా ఇచ్చారు. బాగా విలువ చేసే తన ఇంటిని మహిళల అవసరాల కోసం దానంగా ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నారామె. అంతేకాదు బోధన్ సమీపంలో రెంజల్ మండలం కందకుర్తిలో గోదావరి ఒడ్డున ఉన్న ఓ ఆశ్రమంలోని గోశాలకు కూడ 2.50 లక్షల రూపాయలను విరాళం ఇచ్చారు. మనిషిగా బతికున్నంత కాలం తాను చేసే సేవలే చిరస్థాయిగా నిలబెడతాయన్నదాన్ని సరోజమ్మ బలంగా నమ్ముతారు. ఈ మానవత వాది స్ఫూర్తితో అందరిలోమానవత్వం వికసించాలని పలువురు అభిప్రాయా పడుతున్నారు.