Dharani
Group 1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ వివరాలు..
Group 1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ వివరాలు..
Dharani
ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడ్డ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఆదివారం అనగా జూన్ 9 నాడు.. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో రెండు సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. అయితే పేపర్ లీక్, తప్పు ప్రశ్నలు, బయోమెట్రిక్‌లో గందరగోళం వంటి కారణాల చేత రెండు సార్లు ఈ పరీక్ష రద్దయ్యింది. ఇక ప్రభుత్వం మారిన తర్వాత బోర్డును పూర్తిగా రద్దు చేసి.. కొత్త సభ్యులను నియమించారు. ఇప్పుడు మరోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జూన్ 9, ఆదివారం ఉదయం 9 గంటలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ భారీ శుభవార్త చెప్పింది. ఆ వివారలు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారిని పరీక్షా కేంద్రాలకు చేర్చడంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలనే ఉద్దేశంతో.. పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా బస్సులను నడిపేందుకు రెడీ అయ్యింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 89 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటికి అభ్యర్థులను చేరవేసేలా బస్సు నడిపేలా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
రవాణాపరంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే సంస్థ యాజమాన్యం.. ఆదేశాలు జారీ చేసింది. ఇక జిల్లా కేంద్రాల్లో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం కూడా బస్సులను అందుబాటులో ఉంచింది. ఇక నేటి సాయంత్రం అనగా శనివారం నుంచి హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే అభ్యర్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున.. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్లలో తగు ఏర్పాట్లను చేసింది.
అలానే రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్‌లలో మే ఐ హెల్స్ యూ కౌంటర్లను ఏర్పాటు చేసింది ఆర్టీసీ సంస్థ. వీటి ద్వారా అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల అడ్రెస్, ఆ రూట్లో వెళ్లే బస్సుల వివరాలను తెలియజేస్తారు. ఇక ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాయనున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు గాను.. ఆర్టీసీ ఏర్పాట్లు ఉ చేస్తోంది. ఇక హైదరాబాద్ పరిధిలో సుమారు 1.70 లక్షల మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయనున్నారు. వారందరికి రవాణా సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేలా ఆర్టీసీ చర్యలు చేపట్టనుంది. అలానే పరీక్ష రాయబోయే అభ్యర్థులకు ఆర్టీసీ సంస్థ ఆల ది బెస్ట్ చెప్పింది.
గ్రూప్ 1 సర్వీస్‌లోని 563 పోస్టుల భర్తీకి నోటిఫిషకేషన్ విడుదల చేశారు. దీనిలో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ పోస్టులున్నాయి.