iDreamPost
android-app
ios-app

కేక్ తెచ్చేందుకు తాతతో కలిసి బయటకు వెళ్లిన మనవరాలు..

  • Published Jan 01, 2024 | 1:10 PM Updated Updated Jan 01, 2024 | 1:10 PM

గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సంబరాలు అంబరాన్ని తాకాయి. తమకు నచ్చిన విధంగా న్యూ ఇయర్ వేడుకలను చేసుకున్నారు. కానీ గీతా రెడ్డి మాత్రం..

గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సంబరాలు అంబరాన్ని తాకాయి. తమకు నచ్చిన విధంగా న్యూ ఇయర్ వేడుకలను చేసుకున్నారు. కానీ గీతా రెడ్డి మాత్రం..

  • Published Jan 01, 2024 | 1:10 PMUpdated Jan 01, 2024 | 1:10 PM
కేక్ తెచ్చేందుకు తాతతో కలిసి బయటకు వెళ్లిన మనవరాలు..

పాత ఏడాదికి టాటా చెబుతూ..కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు ప్రజలు. గత రాత్రి సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రపంచంలోని దేశాలన్నీ బాణా సంచాల వెలుగులతో నూతన ఏడాదికి స్వాగతం పలికాయి. కొత్త సంవత్సరానికి తమకు నచ్చినట్లు వెల్కమ్ చెప్పారు ఇండియన్స్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఆనందం ఢోలికల్లో మునిగి తేలిపోయారు. సాధారణంగా న్యూ ఇయర్ అనగానే.. కొంత మంది దైవ చింతనలో బతికితే.. మరికొంత మంది మందు, విందుతో చిల్ అవుతుంటారు. ఇక మహిళలు అయితే రంగు రంగు ముగ్గులతో తమ వాకిళ్లను కాంతులీనేలా చేస్తారు. ఏదీ ఏమైనప్పటికీ.. కొత్త సంవ్సరంలోకి అడుగుపెట్టే సమయానికి తియ్యటి పదార్థాలు తినేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే న్యూ ఇయర్ అనగానే స్వీట్స్, కేక్స్‌కు మంచి డిమాండ్.

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నామన్న సంబరాల్లో మునిగితేలుతున్న ఓ యువతి.. అర్థరాత్రి కేక్ కట్ చేయాలన్న ఉద్దేశంతో దాన్ని కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లింది. అలా వెళ్లిన బాలిక.. ఇంటికి శవమై వచ్చింది. సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటుపల్లి గ్రామ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గీతా రెడ్డి మృత్యువాత పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీతా రెడ్డి తల్లి చనిపోవడంతో.. తాత దగ్గర ఉండి చదువుకుంటోంది. ప్రస్తుతం ఆమె 9వ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. నూతన ఏడాది కోసమని కేక్ తెచ్చేందుకు తాత బండిపై వెళుతుండగా.. లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో గీతా రెడ్డి అక్కడిక్కడే మృతి చెందింది.

తల్లి లేకపోవడంతో ఆమె ఆలనా పాలనా చూస్తున్న తాత ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. న్యూ  ఇయర్ వేడుకల వేళ గీతా రెడ్డి చనిపోయిందన్న వార్త తెలిసి ఆ గ్రామంలో విషాదం నెలకొంది.  స్నేహితులు కంటతడి పెట్టుకుంటున్నారు. కేకు కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిందని తెలిసి.. కన్నీటి పర్యంతమౌతున్నారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద సమయాల్లో మృత్యువు మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet