iDreamPost
android-app
ios-app

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ప్రజాపాలన ప్రత్యేక వెబ్‌సైట్!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై దృష్టి సారిస్తున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై దృష్టి సారిస్తున్నారు.

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ప్రజాపాలన ప్రత్యేక వెబ్‌సైట్!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటి కే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం ప్రారంభించింది. అంతేకాదు డిసెంబర్ 28 నుంచి ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి దరఖాస్తుల కోసం ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలనకు మారు మూల గ్రామాల నుంచి పట్టణాల వరకు భారీ స్పందన వచ్చింది. ఏదైనా కారణాల వల్ల దరఖాస్తులు చేసుకోలేని వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

పదిరోజుల పాటు కొనసాగిన ప్రజా పాలన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోలేని వారు ఆందోళన చెందారు. అయితే దరఖాస్తు చేసుకోలేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఇక నుంచి ప్రజా పాలన కార్యక్రం నాలుగు నెలలకు ఒకసారి ఉండబోతుందని సీఎం శాంత కుమారి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ ని కూడా రూపొందించింది.. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఆ వెబ్ సైట్ ని ప్రారంభించనున్నారు. పదిరోజులు కొనసాగిన ప్రజా పాలన కార్యక్రమంలో కోటి 25 లక్షల పై చిలుకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొంతమంది స్థానికంగా లేనివారు, ఆధార కార్డుల్లో సవరణ, రేషన్ కార్డులు లేని వారు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అలాంటి వారి కోసం సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించేందుక రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

new website for prajapalan

మొన్నటి వరకు ప్రజా పాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులన్నంటింకి ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేసింది. www.prajapalana.telangana.gov.in పేరుతో తయారు చేసిన ఈ వెబ్ సైట్ ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ప్రజా పాలనకు కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులన్నీ ఆ వెబ్ సైట్ లో పొందుపరిచే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. డేటా ఎంట్రీ మొత్తం పూర్తయిన తర్వాత అర్హులైన వారి జాబితాను అధికారులు ప్రకటించి వారికి పథకాలు అమలు చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి చేసేందుక తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని సీఎం తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి