P Krishna
మనిషి జీవితం ఎంతో విలువైంది.. అందుకే చాలా మంది తాము చనిపోయినా కూడా పది మందికి ఉపయోగపడేలా ఉండాలని భావిస్తుంటారు.
మనిషి జీవితం ఎంతో విలువైంది.. అందుకే చాలా మంది తాము చనిపోయినా కూడా పది మందికి ఉపయోగపడేలా ఉండాలని భావిస్తుంటారు.
P Krishna
సాధారణంగా అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యల వల్ల బ్రెయిన్ డెడ్ అయి చనిపోతే వారి కుటుంబ సభ్యులు తమ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కానీ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినా.. వారి అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగు నింపిన సంఘటనలు ఇటీవల కాలంలో ఎన్నో జరిగాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, జీవన్‌ధాన్ కేంద్రం అవయవదానంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ అవయవదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలు నిలబెడుతున్నారు. తాజాగా ఓ మహిళ తాను చనిపోతూ ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపింది. వివరాల్లోకి వెళితే..
మనిషి చనిపోయిన తర్వాత వారి శరీరంలో నుంచి 200 అవయవాలు దానం చేసి కొంతమంది జీవితాలకు వెలుగునివ్వొచ్చు అని వైద్యులు చెబుతున్నారు. మనిషి ప్రాణం ఎంతో విలువైనది.. చనిపోయిన తర్వాత అవయవదానంతో మరికొందరి ప్రాణాలు నిలబెట్టవొచ్చు అంటారు. జిగిత్యాల జిల్లా అంబారీపేటరావు కు చెందిన గోపు రాధ (38) ఈ నెల 12 న అకస్మాత్తుగా ఇంట్లో పడిపోయింది. వెంటనే ఆమెను కీమ్స్ హాస్పిటల్ కి తరలించారు. గోపు రాధ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన జీవన్ దాన్ టీమ్, వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు.
గోపు రాధ కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు. తీరని దుఖఃంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు ఆమె వల్ల మరికొంత మంది జీవితాల్లో వెలుగు వస్తుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే గురువారం గోపు రాధను వెంటిలేటర్ పై ఉంచి.. రెండు కిడ్నీలు, గుండె, కాలేయం, ఒక ఊపిరితిత్తి సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురు రోగులకు అమర్చారు. అనంతరం వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది గోపు రాధ మృతదేహానికి గౌరవ వందనం చేశారు. మృతురాలి భర్త శ్రీనివాస్.. అంబారిపేట మాజీ సర్పంచ్. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.