కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్! ఆ రోజు నుంచే..

New Ration Cards: సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకానికైనా రేషన్ కార్డులు తప్పని సరి అన్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో ప్రజా పాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల సంఖ్యల్లో దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

New Ration Cards: సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకానికైనా రేషన్ కార్డులు తప్పని సరి అన్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో ప్రజా పాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల సంఖ్యల్లో దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

తెలంగాణలో గత ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లింది. ఈ పథకాలపై నమ్మకంతోనే ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రజా పాలన లో ఎక్కవగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. తాజాగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు రేషన్ కార్డు ప్రామాణికం అని తెలిసిందే. ఇటీవల తెలంగాణలో మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఒక్క గ్యారెంటీ మినహా ఐదు గ్యారెంటీలకు దరఖాస్తును ఆహ్వానించింది టీ సర్కార్. ఈ క్రమంలోనే కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రజా పాలనే కాదు.. వారం వారం నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమంలో కూడా చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న వారి జాబితాను రెడీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో త్వరలో కొత్త రేషన్ కార్డుల మంజూరు అవుతాయని సమాచారం.. ఇప్పటికే అధికారులు పెండింగ్ దరఖాస్తులను స్క్రుటినీ చేయడం ప్రారంభించారు. అందులో అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. ఈ ప్రక్రియ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు మోక్షం రానున్నదని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments