Krishna Kowshik
గత ఏడాది అధికారంలోకి వచ్చిన తెలంగాణ సర్కార్.. సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. తమది ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకునేందుకు వివిధ సేవలను తీసుకువస్తుంది. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది.
గత ఏడాది అధికారంలోకి వచ్చిన తెలంగాణ సర్కార్.. సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. తమది ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకునేందుకు వివిధ సేవలను తీసుకువస్తుంది. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది.
Krishna Kowshik
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్.. తమది ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకునేందకు వడివడిగా అడుగులు వేస్తుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోంది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలు, యువతులు, విద్యార్థినులు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు.. 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందించే గృహ జ్యోతి, రూ. 500లకే సిలిండర్, రైతులకు రుణమాఫీ అందిస్తోంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు తెలంగాణ వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఇంటింటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించనుంది. టీ ఫైబర్ పేరుతో ఇంటింటికీ ఫ్రీగా హై స్పీడ్ ఇంటర్నెట్ అందివ్వనుంది. ఆపై తక్కువకే అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.
పట్టణాలు, నగరాలు, పల్లెలకు ఈ సేవలను అందించనుంది. తొలుత ఉచితంగా.. ఆపై రూ. 300లకు టీ ఫైబర్ సేవలు ఇవ్వనుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో సమావేశమై.. తమ ప్రభుత్వం చేపడుతున్న టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3లో చేర్చాలని కోరారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి నెట్ వర్క్ కల్పించడమే ఈ టీ ఫైబర్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని జ్యోతిరాధిత్యకు తెలిపారు సీఎం. ఈ ప్రాజెక్టు అమలుకు ఎన్ఎఫ్ఓఎన్ సహకారం అవసరమని, దీని కోసం రూ. 1, 799 కోట్ల వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంటర్నెంట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలను అందిస్తామని తెలిపారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించాలని తమ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని వివరించారు.
దీనిపై సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి జ్యోతిరాథిత్య సింథియా. దీంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. ఇంటింటికీ హై స్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించేందుకు ఆయా సంస్థల నుండి టెండర్లను ఆహ్వానించింది. తొలుత మూడు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ- ఎడ్యుకేషన్ సేవలను అందిస్తుంది. మూడు నెలల పూర్తయిన తర్వాత తక్కువ ధరకు సేవల్ని అందించనుంది రాష్ట్ర సర్కార్. రూ. 300లకే ఈ సేవలు అందించేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు అధికారులు. టెండర్ల్స్ ఫైనల్ అయ్యాక.. టీ ఫైబర్ ప్రాజెక్టు షురూ కానుంది. ఇక అగ్గువకే ఇంటర్నెట్ సేవలను పొందనున్నారు తెలంగాణ వాసులు.