ప్రయాణికులకు గుడ్ న్యూస్..త్వరలోనే రొడ్డెక్కనున్న1000 కొత్త బస్సులు

TGSRTC: తెలంగాణ రాష్ట్రంలో పొల్యుషన్ కంట్రోల్ చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ వాహనాలు నగరంలో పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది.

TGSRTC: తెలంగాణ రాష్ట్రంలో పొల్యుషన్ కంట్రోల్ చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ వాహనాలు నగరంలో పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది.

నగరంలో సామాన్య ప్రజలు తొందరగా తమ గమ్య స్థానాలకు చేరుకోవడంలో ఆర్టీసీ రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇప్పటికే నగరంలో ఫ్రీ బస్సు సదుపాయంతో చాలామంది ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల రద్దీ మరీంత ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా..  నగరంలో అదనంగా బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాతావరణ పొల్యూష్యన్ తగ్గించేందుకు టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు నగరంలో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలో పొల్యుషన్ కంట్రోల్ చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ వాహనాలు నగరంలో పరుగులు పెడుతున్నాయి. అయితే ఎన్ని బస్సులు వస్తున్నా ప్రయాణికులు రద్దీ క్రమంగా పెరిగిపోతునే ఉంది. ఈ నేపథ్యంలోనే టీజీఎస్ఆర్టీసీ మరో ముందడగు వేసింది. తాజాగా 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ బస్సులు దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన 13 చార్జింగ్ స్టేషన్లను త్వరలోనే సీఎం రేంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) మోడల్‌లో పనిచేస్తాయి.

అంతేకాకుండా.. ఈ 1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ లో తిరగనున్నాయి.  ఇక మిగిలిన ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అధిక ట్రాఫిక్ రూట్లలో నడుస్తాయి. అలాగే హెచ్‌సీయూ, హయత్‌నగర్ వంటి డిపోలలోని డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసి.. గతంలో ఉన్న వాటిని గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు. దీంతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్, హెచ్‌సీయూ, హయత్‌నగర్-2, రాణిగంజ్,కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్,హైదరాబాద్-2, వరంగల్, సూర్యాపేట, కరీంనగర్-2, నిజామాబాద్ సహా పలు డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నారు.  ఇలా ఒక్కో స్టేషన్‌లో 20 నుంచి 25 ఛార్జింగ్ గన్‌లు ఉంటాయి. వీటితో ఒకటి కంటే ఎక్కువ బస్సులు ఒకే సమయంలో ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ ఎయిర్ పోర్ట్ రూట్లలో 49 పుష్పక్ బస్సులు, విజయవాడ, హైదరాబాద మధ్య 10 ఎలక్ట్రానిక్ బస్సులతో సహా మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. మరీ, నగరంలో త్వరలోనే 1000 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments