P Krishna
Good News for Students: తెలంగాణలో ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యనందించాలనే ఉద్దేశంతో నూతన ప్రభుత్వంలో విద్యా మంత్రిత్వ శాఖ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Good News for Students: తెలంగాణలో ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యనందించాలనే ఉద్దేశంతో నూతన ప్రభుత్వంలో విద్యా మంత్రిత్వ శాఖ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా శాఖపై ప్రత్యేకమైన ఫోక్ పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ఇకపై విద్యార్థులక నాణ్యమైన, మెరుగైన విద్యను అందించేందుకు క్వాడ్‌జెన్ సంస్థతో కలిసి రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు ఇంటరాక్టీవ్ వైట్ బోర్డు(ఐడబ్ల్యూబీ), విద్యార్థులకు 20 వేల లోపు ల్యాప్ టాప్ లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 5 జీ మొబైల్ నెట్ వర్క్ ను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణలో ప్రతి పేద విద్యార్థి ఉన్నతమైన విద్యనందించాలని విద్యాధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ఫలితాలపై సమీక్షలు జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం జులై 2న సచివాలంలో సమావేశం అయి ఈ ప్రాజెక్ట్ పై చర్చించారు.
ఇదిలా ఉంటే.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవరసేన మంగళవారం రిలీవ్ అయ్యారు.. ఇటీవల ఐఏఎస్ ల బదిలీల్లో ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు సాంకేతిక విద్యాశాఖ, కళాశాల విద్యాశాఖ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసి ఆయా బాధ్యతల నుంచి ఆమె రిలీవ్ కాగా, ఆమె స్థానంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఈవీ నర్సింహారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం రోజే శ్రీదేవసేన సైతం సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.