Krishna Kowshik
ఇప్పుడిప్పుడే బడి బాట పడుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ వారంలో రెండు రోజులు సెలవులు రాబోతున్నాయి. ఈ టూడేస్ హాలీడేస్ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఇప్పుడిప్పుడే బడి బాట పడుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ వారంలో రెండు రోజులు సెలవులు రాబోతున్నాయి. ఈ టూడేస్ హాలీడేస్ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Krishna Kowshik
ఎండాకాలం సెలవులు ముగిసి బడి బాట పట్టారు విద్యార్థులు. కొత్త తరగతిలోకి అడుగుపెట్టామన్న ఆనందంలో మునిగి తేలుతున్నారు. కొత్త పుస్తకాలు, యూనిఫామ్స్‌తో సంబరపడిపోతున్నారు. ఇప్పుడిప్పుడే పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులకు అంతలో పలు సెలవులు వచ్చాయి. బక్రీద్, బంద్ అంటూ పలు సెలవులు రావడంతో ఎంజాయ్ చేశారు. అంతలో జులై నెల వచ్చేసింది. ఈ నెలలో కూడా విద్యార్థులను బోలెడన్నీసెలవులు రాబోతున్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు హలీడేస్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ నెల 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి. ఎందుకంటే మొహర్రం మాసాన్ని పురస్కరించుకుని ఈ రెండ్రోజుల సెలవులను ప్రకటించింది తెలంగాణ సర్కార్. మొహర్రం మాసంలో షియా, సున్నీ ముస్లింలు సంతాప దినాలుగా జరపుకోవడం ఆనవాయితీ వస్తుంది. ఈ క్రమంలోనే 9, 10 తేదీలకు సెలవును ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ సోమవారం బడికి వెళితే.. మంగళ, బుధవారం సెలవులు. మహాప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్‌తో పాటు 72 మంది కుటుంబ సభ్యులు యజీదుల చేతుల్లో షహీదులైన వైనాన్ని పురస్కరించుకుని సంతాప దినాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆ రోజులను సంతాపదినాలుగా పేర్కొంటూ సెలవులు ప్రకటించింది.
అలాగే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, ముస్లిం సోదరులకు మొహర్రం మొదటి నెల. కాగా ఈ నెల విషాదాలతో మొదలవుతోంది. అయితే మొహర్రం మాసంలో 10 వ రోజున షియా ముస్లింలు ఆలం (పీర్ల)ను ఊరేగిస్తుంటారు. ఆ రోజు హజ్రత్ ఇమాం హుస్సేన్‌ను గుర్తుచేసుకుంటూ.. తమ సంతాపం తెలుపుతార. సున్నీ తెగకు చెందిన ముస్లింలు ఉపవాస దీక్షలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటారు. అంతేకాకుండా వీటితో పాటు మొహర్రం సెలవులు కూడా ప్రకటించింది సర్కార్. అప్పుడు కూడా రెండు రోజులు సెలువు రానున్నాయి. కేవలం విద్యార్థులకే కాదు.. ఉద్యోగస్థులకు కూడా ఈ సెలవులు వర్తించనున్నాయి. అధికారిక క్యాలెండర్ ప్రకారం…జూలై 16, 17 తేదీల్లో ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఇవి కూడా మంగళ, బుధవారాల్లో వచ్చాయి.