iDreamPost
android-app
ios-app

Chicken Price:మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధర

  • Published Jan 08, 2024 | 3:04 PM Updated Updated Jan 08, 2024 | 3:04 PM

సాధారణంగా చికెన్ ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ప్రపంచం మొత్తం నాన్ వెజ్ ప్రియులు ఉండబట్టే.. వాటి డిమాండ్, ధరలు కూడా భారీగానే ఉంటాయి. అయితే గతకొంత కాలంగా చికెన్ ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మాంసం ప్రియులకు మంచి శుభవార్త అందింది. తాజాగా చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఇంతకి కేజీ చికెన్ ధర ఎంతంటే..?

సాధారణంగా చికెన్ ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ప్రపంచం మొత్తం నాన్ వెజ్ ప్రియులు ఉండబట్టే.. వాటి డిమాండ్, ధరలు కూడా భారీగానే ఉంటాయి. అయితే గతకొంత కాలంగా చికెన్ ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మాంసం ప్రియులకు మంచి శుభవార్త అందింది. తాజాగా చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఇంతకి కేజీ చికెన్ ధర ఎంతంటే..?

  • Published Jan 08, 2024 | 3:04 PMUpdated Jan 08, 2024 | 3:04 PM
Chicken Price:మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధర

సాధారణంగా చికెన్ ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ప్రపంచం మొత్తం వెజిటీరియన్స్‌ కంటే నాన్‌ వెజిటీరియన్సే వారే ఎక్కువగా ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతిఒక్కరికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. అంతలా చికెన్ అంటే ఇష్టంగా పడిచస్తారు. మరి అంతలా నాన్ వెజ్ ప్రియులు ఉండబట్టే.. వాటి డిమాండ్, ధరలు కూడా భారీగానే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మాంసం ధరలు భారీగా పెరిగిపోతుంటాయి. అలాంటి సమయంలో చాలామంది నోరు కట్టుకుంటూ ఉంటారు. ఇక ధరలు తగ్గినపుడు మాత్రం వెంటనే చికెన్ షాపుల వైపు పరుగులు తీస్తారు. ఇదిలా ఉంటే.. గతేడాది కార్తికమాసం, ఈ న్యూయార్ సందర్భంగా చికెన్ ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చికెన్ ధరలు తగ్గడంతో నాన్ వెజ్ ప్రియులకు కొంత ఊరట లభించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొంత కాలంగా చికెన్ ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. దీంతో చికెన్ ప్రియులు దాన్ని ధరలను చూసి తినలేక, ఉండలేక సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గాయి. నిజంగా ఇది మాంసం ప్రియులకు మంచి శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చికెన్ ధరలు మొన్నటి వరకు కొండెక్కి కూర్చోవడంతో సామన్య ప్రజలు దానిని కొనాలంటే భయపడేవారు. చికెన్ తో పాటు గుడ్ల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా చికెన్ రెటు తగ్గడంతో నాన్ వెజ్ ప్రియులు చాలా ఆనంద పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ చికెన్ రూ. 150-160 మధ్య అందుబాటులో లభిస్తోంది. అలాగే విత్ స్కిన్ రూ. 120 పలుకుతోంది. ఇలా ఒక్కసారిగా చికెన్ ధర తగ్గడానికి కారణం డిమాండ్ అంతగగా లేకపోవటంతో ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే డిమాండ్ కంటే సప్లయ్ ఎక్కువగా ఉండటంతో ధర తగ్గినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ధరలు వచ్చే సంక్రాంతి వరకు ఇలానే కొనసాగితే పండగ సీజన్‌లో భారీ విక్రయాలు జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ఇక గతంలో చికెన్, గుడ్లు ధరలు భారీగా పెరిగగా, కేజీ చికెన్ రూ. 250 ఉండగా.. ఒక గుడ్డు రూ. 7-8 వరకు పలికింది. దీంతో మాసం కొనలేక, తినలేక మాంసం ప్రియులు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం అలా ఇబ్బంది పడే అవసరం లేకుండా చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కానీ, ఇప్పుడు ఇదే సమయంలో కూరగాయాల ధరలు మాత్రం విపరీతంగా పెరిగుతున్నాయి. దీంతో చాలామంది ప్రజలు కూరగాయల కొనడం కంటే చికెన్ కొని తినడం మేలు అని అభిప్రాయ పడుతున్నారు. మరి, చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.