iDreamPost
android-app
ios-app

TSRTC గుడ్ న్యూస్.. కేవలం రూ. 20తో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు, ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో రాకపోకలు మొదలయ్యాయి. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ పలు శుభవార్తలు ప్రకటించింది. తాజాాగా ఆ బస్ పాస్ దారులకు గుడ్ న్యూస్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు, ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో రాకపోకలు మొదలయ్యాయి. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ పలు శుభవార్తలు ప్రకటించింది. తాజాాగా ఆ బస్ పాస్ దారులకు గుడ్ న్యూస్ తెలిపింది.

TSRTC గుడ్  న్యూస్.. కేవలం రూ. 20తో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే  సౌకర్యం

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేప్టటిన నాటి నుండి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు విశేషమైన కృషి చేస్తున్నారు. ఆర్టీసీలో కుటుంబ సభ్యులతో ప్రయాణించి.. ప్రయాణీకుల్లో అవగాహన కల్పించారు. అలాగే ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకు వచ్చిన సంగతి విదితమే. దీంతో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో బస్సులను పెంచారు. రద్దీ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు కొత్త బస్సులను తీసుకు వచ్చి..ప్రజాదరణ చూరగొన్నారు. ఇప్పుడు ఎలక్షన్, సమ్మర్ సీజన్ కావడంతో ఏపీకి ప్రయాణీకుల తాకిడి ఎక్కువైంది. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడకు ప్రతి పది నిమిషాలకు బస్సు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ముందస్తు రిజర్వేషన్ చేయించుకుంటే పదిశాతం తగ్గింపు కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పుడు తాజాగా బస్సు ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ (MST)పాస్ దారులకు శుభవార్త తెలిపింది. ఈ పాస్ ఉన్న వాళ్లు సైతం ఇక డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసలుబాటును కల్పించింది. ఈ మేరకు వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘ఎక్స్‌ ప్రెస్‌ మంత్లీ సీజన్‌ టికెట్‌(MST) పాస్‌ దారులకు శుభవార్త! ఈ పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును #TSRTC కల్పించింది. రూ.20 కాంబినేషన్‌ టికెట్‌ తీసుకుని డీలక్స్‌ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చు. ఎక్స్‌ ప్రెస్‌ పాస్‌ దారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఈ కాంబినేషన్‌ టికెట్‌ సదుపాయాన్ని వినియోగించుకుని డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించాలని సంస్థ కోరుతోంది.

100 కిలోమీటర్ల పరిధిలో జారీ చేసే ఈ పాస్‌ కావాలనుకునే వారు టీఎస్‌ఆర్టీసీకి చెందిన స్థానిక బస్‌ పాస్‌ కౌంటర్లను సంప్రదించగలరు’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కేవలం కాంబినేషన్ టికెట్‌తో ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ దారులు.. ఇక డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చునన్న మాట. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డీలక్స్ బస్సులకు ఇది వర్తిస్తుంది. అయితే ఇది కేవలం సమ్మర్ వరకా.. లేక ఆ తర్వాత కూడా కొనసాగుతుందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నుండి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ ఇటీవల శుభవార్త చెప్పింది. 8 రోజుల ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకుంటే. రిజర్వేషన్ చార్జీలను మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.