iDreamPost
android-app
ios-app

HYD కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ దుర్గం చెరువుపై గత ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జిని నిర్మించింది. దీని గుండా అనేక మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రాగానే.. ఆహ్లాదకరమైన వాాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడకు నగర వాసులు వస్తుంటారు. అయితే

హైదరాబాద్ దుర్గం చెరువుపై గత ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జిని నిర్మించింది. దీని గుండా అనేక మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రాగానే.. ఆహ్లాదకరమైన వాాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడకు నగర వాసులు వస్తుంటారు. అయితే

HYD కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ మహానగరంలో టూరిస్టు ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. నిత్యం దీని గుండా వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. సినిమా షూటింగ్స్‌తో ఈ ప్రాంతం మరింత ఫేమస్ అయ్యింది. వీకెండ్ ఇక్కడ ఎంజాయ్ చేసేందుకు నగర వాసులు వస్తుంటారు. దీంతో ఇదొక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. అక్కడకు వచ్చిన బైక్స్ ఆఫేసి.. సరదాగా ఫోటోలు దిగుతుండటంతో ఇటీవల ఓ యువకుడు మరణించాడు. దీంతో మాదాపూర్ పోలీసులు.. వాహనాలు నిలిపివేయడంపై ఆంక్షలు విధించారు. రోడ్డుపై వాహనాలు నిలిపి వేసి.. ఫోటోలు దిగితే.. రూ. వెయ్యి ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. అంతలో ఇప్పుడు మరో సంఘటన చోటుచేసుకుంది. కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఓ యువతి ఆత్మహత్యయత్నం చేయడం ఇప్పుడు కలకలం రేపింది.

అయితే అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు అడ్డుకని యువతిని కాపాడారు. దాదాపు 25 ఏళ్ల యవస్సున్న యువతి సోమవారం మధ్యాహ్నం దుర్గం చెరువు తీగల వంతెన వద్దకు వచ్చింది. చెరువులో దూకేందుకు వంతెనపైకి ఎక్కింది. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు.. ఆమెను కాపాడగలిగారు. అయితే యువతి నిద్ర మాత్రలు తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, యువతి ఆత్మహత్యాయత్నించే ఆ సమయంలో కేబుల్ బ్రిడ్జిపై కాస్త హైడ్రామా నడిచింది. ఏం జరిగిందో తెలియక.. కొంత మంది వాహనదారులు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపి వేసి సమాచారం తెలుసుకున్నారు.

హైదరాబాద్‌లో దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రాగానే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి నగరవాసులు వస్తుంటారు. పిల్లలను తీసుకుని భార్యా భర్తలు కూడా ఇక్కడకు వచ్చి గడుపుతుంటారు. అయితే.. దురదృష్టవశాత్తు కేబుల్ బ్రిడ్జి విషాదాలకు కేరాఫ్‌గా మారిపోయింది. అయితే ఆత్మహత్యలు లేదంటే ప్రమాదాలు  జరుగుతున్నాయి. అటు వైపు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కేబుల్ బ్రిడ్జిపై ఇప్పటిదాకా 40మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. దుర్గం చెరువు అందాలను వీక్షిస్తూ.. చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తూనే క్షణాల్లో చెరువులోకి దూకి చాలామంది సూసైడ్ చేసుకున్నారు.