మీ ప్రాంతంలో వీధి కుక్కలు ఉన్నాయా? ఈ నంబర్ కు కాల్ చేయండి!

GHMC Toll Free Number For Stray Dog Control: జీహెచ్ఎంసీ అధికారులు వీధి కుక్కల నియంత్రణ, వాటి నుంచి ప్రజల రక్షణకు సంబంధించి చర్యలు ముమ్మరం చేసింది. తాజాగా మరోసారి టోల్ ఫ్రీ నంబరును తీసుకొచ్చారు.

GHMC Toll Free Number For Stray Dog Control: జీహెచ్ఎంసీ అధికారులు వీధి కుక్కల నియంత్రణ, వాటి నుంచి ప్రజల రక్షణకు సంబంధించి చర్యలు ముమ్మరం చేసింది. తాజాగా మరోసారి టోల్ ఫ్రీ నంబరును తీసుకొచ్చారు.

వీధి కుక్కలు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఇళ్లలో పెంచుకునే కుక్కల బాగోగులు పెంచుకునే వాళ్లు చూస్తారు. వాటికి సమయానికి ఆహారం, తాగడానికి నీళ్లు, షెల్టర్ ఇలా అన్నీ ఉంటాయి. కానీ, వీధిలో ఉండే స్ట్రే డాగ్స్ పరిస్థితి అలా ఉండదు. ఎవరో పెడితే గానీ.. వాటికి ఆహారం దొరకదు. వర్షం పడితే గానీ తాగడానికి నీళ్లు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో అవి కాస్త వైల్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. వాటి ప్రవర్తన చాలా భయానకంగా ఉంటుంది. అటుగా ఎవరైనా వెళ్లే వారి పని అయిపోయినట్లే. అంటే అది కాలే కడుపు నుంచి వచ్చే ఆక్రోశం కూడా కావచ్చు. లేదంటే అది ఉండే ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను అనే భ్రమలో దాడులు కూడా చేయచ్చు. ఇప్పుడు ఇలాంటి అనార్థాలు జరగకుండా కట్టడి చేయచ్చు.

వీధి కుక్కల బెడద, భయం అనేది అందరికీ ఉండేదే. వారి వారి ప్రాంతాల్లో కనీసం రెండు, మూడు అయినా కుక్కలు ఉంటాయి. అయితే భాగ్యనగరం లాంటి ప్రాంతాల్లో అది మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ఎన్జీవోలు అలాంటి కుక్కల కోసం పని చేస్తున్నా కూడా అది అంత ఎఫెక్టివ్ గా వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే హైదరాబాద్ లో అన్ని జాగిలాలు ఉన్నాయి మరి. అయితే ఈ మధ్యకాలంలో వీధి కుక్కల దాడిలో ఎంతో మంది గాయపడ్డారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. వీధి కుక్కల బెడద అనేది పట్టించుకోకుండా ఉండే చిన్న సమస్య అయితే కాదు. అలాగే హైకోర్టు కూడా ఈ సమస్యను సీరియస్ గా తీసుకుంది.

గతేడాది ఫిబ్రవరి 19న బాగ్ అంబర్ పేటలో కుక్కల దాడిలో విద్యార్థి మృతి అనే వార్తను చూసి హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ లతో కూడిన ధర్మాసనం గురువారం మళ్లీ విచారణ జరిపింది. ఈ సందర్భంగా హెల్ లైన్ ఏర్పాటు చేసే విషయంపై యోచించాలంటూ సూచనలు చేసింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు ఆ విషయంపై స్పందిస్తూ వీధి కుక్కల బెడదకు సంబంధించి.. హెల్ప్ లైన్ నంబరును మరోసారి తీసుకొచ్చారు. మీ ప్రాంతంలో వీధి కుక్కలు ఉంటే.. 040- 21111111, 040- 23225397 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. జీహెచ్ఎంసీ అధికారులు ఆ వీధి కుక్కలను పట్టుకుని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తారు. ఈ విషయాన్ని అధికారులు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

Show comments