iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ గంజాయి మాఫియా ప్లాన్! ఈ మిల్క్ షేక్.. తాగితే 7 గంటలు మత్తులోనే!

  • Published Apr 18, 2024 | 1:05 PM Updated Updated Apr 18, 2024 | 1:45 PM

Ganja Milkshake: హైదరాబాద్ లో దొరికే ఓ మిల్క్ షేక్ తాగితే.. గంటల పాటు మత్తులో తూగాల్సిందే అంటున్నారు. ఎందుకంటే..

Ganja Milkshake: హైదరాబాద్ లో దొరికే ఓ మిల్క్ షేక్ తాగితే.. గంటల పాటు మత్తులో తూగాల్సిందే అంటున్నారు. ఎందుకంటే..

  • Published Apr 18, 2024 | 1:05 PMUpdated Apr 18, 2024 | 1:45 PM
హైదరాబాద్ గంజాయి మాఫియా ప్లాన్! ఈ మిల్క్ షేక్.. తాగితే 7 గంటలు మత్తులోనే!

మిల్క్ షేక్ అంటే చాలా మందికి ఇష్టం. పాలు తాగడానికి ఇష్టపడని పిల్లలు కూడా మిల్క్ షేక్ అంటే లొట్టలేస్తారు. కారణం చాక్లెట్, మ్యాంగో, వెనీలా ఇలా రకరకకాల ఫ్లేవర్స్ లో లభిస్తుండటంతో.. పాలంటే యాక్ అనే వారు సైతం.. గటగటా తాగేస్తారు. మీకు కూడా మిల్క్ అంటు ఇష్టమా.. అయితే జర భద్రం. ఎందుకంటే.. ఇప్పుడు మేం చెప్పబోయే మిల్క్ షేక్ తాగితే.. కచ్చితంగా గంటల పాటు మత్తులో తూగుతారు. అదేం మిల్క్ షేక్.. అసలు ఎక్కడ దొరుకుతుంది అంటే..

ఇప్పుడు మేం చెప్పబోయే మిల్క్ షేక్ తాగితే.. 7 గంటల పాటు మత్తులో తూగుతారు. పైగా ఇది కెఫేలోనో.. మిల్క్ షేక్ ఫ్యాక్టరీలోనో దొరుకుతుంది అనుకుంటే కప్పులో కాలేసినట్లే. చిన్న కిరాణ దుకాణంలో ఈ మిల్క్ షేక్ దొరుకుతుంది. ఇక ఇది తాగితే ఎందకు మత్తులో తూగుతామంటే.. దీనిలో కలిపేది ఏ ఐస్‌క్రీమో, చాక్లెట్ సిరపో కాదండోయ్.. గంజాయి. పాలు, హార్లిక్స్, బూస్ట్‌లో ఈ పౌడర్ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ.. గంజాయిని పొడి చేసి అమ్మేస్తున్నాడు ఓ కిరాణా షాపు యజమాని. ఈ నయా దందా హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలోని ఓ కిరాణాషాపులో వెలుగు చూస్తుంది.

మొన్నటి వరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి స్మగ్లర్లు తాజాగా తమ దందాను మిల్క్ షేక్ పౌడర్ రూపంలోకి మార్చారు. పాలు, హార్లిక్స్, బూస్టులో ఈ పొడి కలుపుకొని.. మిల్క్ షేక్ లా తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ యువతను మత్తుకు అలవాటు చేస్తున్నాడో కిరాణాషాపు యజమాని. అతడి మాటలు విని.. ఈ మిల్క్‌షేక్ తాగినవారు 7 గంటల పాటు మత్తులో జోగుతున్నారు.

ఈ మిల్క్ షేక్ గురించి పోలీసులకు సమాచారం అందడంతో.. దాడులు జరిపారు. దాంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్ట ప్రాంతంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు దాడులు చేసి కిరాణ దుకాణం యజమాని మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 4 కేజీల గంజాయి పౌడర్, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మనోజ్ కుమార్ కు సప్లయ్ చేసిన మోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ గంజాయి పొడిని కిలో 2500 రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు తెలిసింది.