iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు! పాన్ షాపులే అడ్డాగా!

  • Published Jan 06, 2024 | 4:00 PMUpdated Jan 06, 2024 | 4:00 PM

నగరంలో రోజురోజుకి గంజాయిల ఆక్రమణకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఓవైపు గంజాయి సరఫరా, వాడకాన్ని నివారించేందుకు పోలీసులు తెగ కష్టపడుతుంటే.. స్మగ్లర్లు జోరు మాత్రం రోజురోజుకి పేరిగిపోతుంది. తాజాగా హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల రూపంలో అమ్మకం జరుగుతోంది. ఇంతకి అది ఎక్కడంటే..

నగరంలో రోజురోజుకి గంజాయిల ఆక్రమణకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఓవైపు గంజాయి సరఫరా, వాడకాన్ని నివారించేందుకు పోలీసులు తెగ కష్టపడుతుంటే.. స్మగ్లర్లు జోరు మాత్రం రోజురోజుకి పేరిగిపోతుంది. తాజాగా హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల రూపంలో అమ్మకం జరుగుతోంది. ఇంతకి అది ఎక్కడంటే..

  • Published Jan 06, 2024 | 4:00 PMUpdated Jan 06, 2024 | 4:00 PM
హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు! పాన్ షాపులే అడ్డాగా!

దేశంలో రోజురోజుకి గంజాయిల ఆక్రమణకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ గంజాయి దందా అనేది నగరంలో చాప క్రింద నీరులా విస్తరిస్తుంది. ఎక్కువగా ఈ గంజాయి మత్తుకి యువత బలైపోతున్నారు. మత్తులో అనేక నేరాలు చేస్తూ.. నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే ఈ గంజాయి మత్తులో చాలావరకు కాలేజీకి వెళ్లి చదువుకున్న యువకులే బానిసలవుతున్నారు. కాగా, దీని పై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న గంజాయి సామ్రాజ్యాం రానురాను పలు ప్రాంతాల్లో విస్తరించుకుంటూ పోతుంది. రాత్రి సమయాల్లో యువత గ్రామ శివారులను అడ్డగా చేసుకోని మత్తు పదార్థాలను సేవిస్తున్నారు.ఇప్పటికే పలు చోట్ల ఈ గంజాయి అక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్న వాటిని పూర్తి స్థాయిలో ఆరికట్టలేక పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల రూపంలో అమ్మకం జరుగుతోంది. ఇంతకి అది ఎక్కడంటే..

నగరంలో ఓవైపు గంజాయి సరఫరా, వాడకాన్ని నివారించేందుకు పోలీసులు తెగ కష్టపడుతుంటే.. స్మగ్లర్లు జోరు మాత్రం రోజురోజుకి పేరిగిపోతుంది. కొత్త కొత్త ఐడియాలు, క్రియేటివిటీతో గంజాయి సరఫరా చేస్తూనే ఉన్నారు. కనీసం ఊహకు కూడా అందని విధంగా ఈ గంజాయి ముఠా సరఫరా అనేది అధికారులకు షాకయ్యేలా చేస్తున్నారు. చివరికి గంజాయి దందా అనేది పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లలో రూపంలో విక్రయాలు చేస్తున్నారు. తాజాగా ఈ గంజాయి మూఠాకు సంబంధించి శుక్రవారం విశ్వసనీయ సమాచారం అందుకున్న శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న కటేధాన్ స్వప్న థీయేటర్ సమీపంలోని రమేశ్ చంద్రజేన్ అనే పాన్ షాప్ నిర్వాహకుడు ఒడిస్సా నుంచి ఈ గంజాయి చాక్లెట్లు విక్రయించి ఇక్కడ యువకులకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడి నుంచి పోలీసులు 5.3 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే సీటిలో పలుచోట్ల ఈ గంజాయి ఆక్రమణలను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని జీడిమెట్లలో 86 కిలోల గంజాయి, వికారాబాద్ లో 500 గ్రాముల ఎండు గంజాయి ని ఆయా పరిధి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుపుతూ.. చిన్నారులను కూడా గంజాయిక ఊభిలో బానిసలుగా తయారు చేస్తున్నారు. మరి, చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి