P Krishna
Mahabubabad Crime News: తక్కువ సమయంలో కోట్లు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాలు గడపాలని కొంతమంది ఎన్నో మోసాలకు తెగబడుతున్నారు. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు చెల్లిస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి కోట్లు దండుకొని ఉడాయిస్తున్నారు.
Mahabubabad Crime News: తక్కువ సమయంలో కోట్లు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాలు గడపాలని కొంతమంది ఎన్నో మోసాలకు తెగబడుతున్నారు. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు చెల్లిస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి కోట్లు దండుకొని ఉడాయిస్తున్నారు.
P Krishna
ఈ మధ్య కొంతమంది కేటుగాళ్ళు డబ్బు కోసం ఎన్నో మోసాలు, దారుణాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సమాజంలో లగ్జరీ జీవితాన్ని జీవించేందుకు పలు నేరాలకు పాల్పపడుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవొచ్చిని రక రకాల స్కీములు, చిట్టీల పేరుతో మోసాలు చేస్తూ కోట్ల రూపాయలు వసూళ్లు చేసి బిషానా ఎత్తేస్తున్నారు. పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా జనాల అమాయకత్వాన్ని మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బు ఇస్తానంటూ జనాలను మోసం చేసిన ఓ వ్యాపారి పోలీసులు పన్నిన వలలో పడిపోయాడు.. ఇంతకీ ఆ వ్యాపారి ఎవరు? ఎన్ని కోట్లు మోసం చేశాడు?. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఓ వ్యాపారి పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో డబ్బు చెల్లిస్తామని రక రకాల ఆఫర్లు ప్రకటించి ప్రజల వద్ద నుంచి పెట్టుబడుల కింద డబ్బు తీసుకున్నాడు. అలా పది కోట్ల వరకు డబ్బు తీసుకున్న సదరు వ్యాపారి ప్రజలను మెసం చేసి ఉడాయించాడు. అసలు నిజం తెలుసుకున్న బాధితులు లబో దిబో అంటూ రోడ్లెక్కారు. తమకు న్యాయం చేయాలని ఇల్లందు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఆశ్రయించి తమ బాధను చెప్పుకున్నారు. సదరు వ్యాపారిపై బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ తీసుకున్నారు.
జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగారు పోలీసులు. గణేష్ కోసం 20 రోజుల పాటు విసృతంగా గాలించారు. గణేష్ పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ వాడారు అలాగే కమ్యూనికేషన్ పై నిఘా పెంచారు. గణేష్ కమ్యూనికేషన్ కనిపెట్టి అతడు వారణాసిలో ఉన్నట్లు సమాచారం తెలుసుకొని వెంటనే అక్కడికి బయలుదేరి ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. సదరు వ్యాపారి నుంచి డబ్బు రికవరీ చేసి బాధితులకు తగు న్యాయం చేస్తామని ఎస్పీ తెలిపానట్లు వార్తలు వస్తున్నాయి.