ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ గుండెపోటుకు గురైయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. గత కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యం బాగుండటంలేదు. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గద్దర్ ను స్వయంగా వచ్చి కలిసి, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా.. కాంగ్రెస్ నేత, సీఎల్పీ చీఫ్ మల్లు భట్టి విక్రమార్క తలపెట్టిన పీపుల్స్ మార్చ్ లో యాత్రలో పాల్గొన్నారు గద్దర్. ఈ యాత్రలో పాల్గొంటుండగానే.. గద్దర్ గుండె సంబంధిత సమస్యతో తీవ్ర ఇబ్బంది పడ్డట్లుగా పేర్కొన్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ గుండె పోటుకు గురైయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు. గత పది రోజులుగా ఆయన ఈ ఆస్పటల్లో గుండె సంబంధిత చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. పీపుల్స్ మార్చ్ యాత్రలో పాల్గొన్న సమయంలోనే గుండె సంబంధిత ఇబ్బంది వచ్చిందని గద్దర్ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే గద్దర్ హైదరాబాద్ లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరారు. గత 10 రోజులుగా ఆయన ఈ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక 20వ తేదీ నుంచి పలు పరీక్షలు నిర్వహించినట్లు గద్దర్ తెలియజేశారు. కాగా.. డాక్టర్ దాసరి ప్రసాద్ రావు ఇతర ప్రత్యేక వైద్యుల బృందంతో గద్దర్ కు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం గద్దర్ ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని వైద్యుల బృందం తెలిపింది. ఇక ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా యుద్దనౌక త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఇదికూడా చదవండి: హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం!