iDreamPost
android-app
ios-app

తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీ బ్యాగ్రౌండ్! చదువు లేదు, తాపీ మేస్త్రి నుంచి..!

  • Published Jun 03, 2024 | 2:10 PMUpdated Jun 03, 2024 | 2:10 PM

తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించబడిన జయజయహే తెలంగాణ గీతాన్ని రచించిన కవి అందెశ్రీ.. అస్సలు ఏం చదువుకోలేదనే విషయం మీకు తెలుసా? అందెశ్రీ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించబడిన జయజయహే తెలంగాణ గీతాన్ని రచించిన కవి అందెశ్రీ.. అస్సలు ఏం చదువుకోలేదనే విషయం మీకు తెలుసా? అందెశ్రీ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 03, 2024 | 2:10 PMUpdated Jun 03, 2024 | 2:10 PM
తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీ బ్యాగ్రౌండ్! చదువు లేదు, తాపీ మేస్త్రి నుంచి..!

జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా ఆమోదించింది. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ గీతాన్ని ఆలపించారు. ఆ సమయంలో ఒకాయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఎవరో కాదు.. ఆ గీతాన్ని రచించిన కవి ‘అందెశ్రీ’. తను గుండెలో పుట్టి, గొంతులో పలికిన గీతం.. కొన్ని కోట్ల మంది ప్రజలను ఉద్యమం వైపు నడిపించింది. ఇప్పుడు అదే గీతం రాష్ట్ర అధికారిక గీతంగా ఆమోదించబడిన ఉద్విగ్న క్షణాల్లో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అయితే.. ఒక రాష్ట్రానికి అధికారిక గీతం అందించే స్థాయి కవి.. ఏనాడు బడి ముఖం చూడలేదంటే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. కొన్ని ఏళ్లుగా తాపీ మేస్త్రీగా కూడా పనిచేసిన అందెశ్రీ గురించి చాలా మంది తెలియని విషయాల గురించి, విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

డాక్టర్‌ అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన ఒక అనాథ. వరంగల్‌ జిల్లా మద్దూర్‌ మండలం రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించారు. తల్లిదంద్రలు లేకపోవడంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం మొదలుపెట్టాడు. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రీగా పనిచేసిన అందె ఎల్లయ్యకు పాటన్న, పద్యమన్న ప్రాణం. అయితే.. ఇది సాధారణంగా పుట్టిన ఇష్టం కాదు. పీడిత బతుకులను చూసి పుట్టిన ఆవేదన. అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని, పీడనను ఎదిరించే గుణం నుంచి పుట్టిన ఉద్యమం అందెశ్రీ పాటలు. ఉద్యమం తాలుకూ ప్రభావం అందెశ్రీగా చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది. ‘తెలంగాణ ధూంధాం’ కార్యక్రమ రూపశిల్పిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.

ఉద్యమ పాటలు, తెలంగాణ జనం బతుకు, ప్రకృతి మీద పాటలు రాసే అందెశ్రీ.. గొప్ప సినిమా పాటలు కూడా రాశారు. ‘జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి’ అంటూ సాగే పాట ప్రతి తెలంగాణ పౌరుడిలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. ‘మయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు’ పాట ఆయన మతం పేరుతో జరిగే దారుణాలను ఎండగట్టింది. ఇలా చెప్పుకుంటే పోతే.. అందెశ్రీ నుంచి వచ్చినవి ఎన్నో. తెలంగాణలో చాలా మంది కవులు, రచయితలు ఉన్నప్పటికీ.. అందెశ్రీ ప్రత్యేకం. ఎందుకంటే.. ఆయన ఎప్పుడు పాలపక్షం వహించలేదు. మనిషికి అన్యాయం జరిగితే.. పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా పాటతో ప్రశ్నించడమే ఆయన తత్వం. అందుకే అందెశ్రీ అంటే ప్రజాకవి, లోకకవి.

అందెశ్రీ ఘనతలు..
2014లో పద్మశీ కోసం అందెశ్రీ పేరును తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన ‘మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు’ పాటను ఆంధ్రప్రదేశ్‌లోనిశ్లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్‌లో చేర్చారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ అందించింది. అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్టన్‌ డీసీ వారి గౌరవ డాక్టరేట్ తోపాటు ‘లోకకవి’ అనే బిరుదునిచ్చి 2014 ఫిబ్రవరి 1లో సన్మానించింది. వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం 2015లో దక్కింది. డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం 2015లో అందుకున్నారు. అందెశ్రీకి నంది అవార్డు కూడా వచ్చింది. సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం 2022లో దక్కింది. ఇప్పుడు తాజాగా ఆయన రచించిన జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించబడి.. చరిత్రలో నిలిచిపోయింది. మరి ఒక తాపీ మేస్త్రీ.. రాష్ట్ర అధికారిక గీతం అందిచే స్థాయికి చేరుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి