P Krishna
ఇటీవల దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం శీతాకాలం కావడంతో రోడ్లపై పొగమంచు కారణంగా హైవేపై ప్రమాదాల సంఖ్య మరింత పెరిగిందని అధికారులు అంటున్నారు.
ఇటీవల దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం శీతాకాలం కావడంతో రోడ్లపై పొగమంచు కారణంగా హైవేపై ప్రమాదాల సంఖ్య మరింత పెరిగిందని అధికారులు అంటున్నారు.
P Krishna
దేశంలో ఈ మద్య ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు మఖ్యంగా అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ పై అవగాణ లేకుండా డ్రైవ్ చేయడం లాంటి కారణాలు అంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఉదయం రోడ్లన్నీ పొగమంచు కప్పేస్తుంది.. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం అసోం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. విహార యాత్రకు వెళ్తున్న బస్సు ఎదురుగా వచ్చిన ట్రక్ ని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. తాజాగా నారింజ పండ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అని అంటుంటారు. అలాంటిది రోడ్డుపై పెద్ద ఎత్తున నారింజ పండ్లు ఫ్రీగా దొరికితే ఎవరైనా వదులుతారా? ప్లాస్టీక్ బ్యాగులు తెచ్చుకొని మరీ క్షణాల్లో లూటీ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న నారింజ పండ్ల లారీ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కుష్టి వద్దకు రాగానే హఠాత్తుగా లారీ అదుపు తప్పి బోల్తా పడిపోయింది. దీంతో లారీలో ఉన్న నారింజ పండ్లు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఇంకేముంది.. లారీ డ్రైవర్, క్లీనర్ గురించి పట్టించుకోకుండా అటుగా వెళ్తున్న వాహనదారులు పండ్లు తీసుకునేందుకు ఎగబడ్డారు. అంతేకాదు ఈ విషయం గురించి తెలిసి స్థానిక గ్రామ ప్రజలు ప్లాస్టీక్ బ్యాగులు తెచ్చుకొని అందులో నింపుకొని వెళ్లారు.
ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసిసోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని అందరినీ పంపించి వేశారు.. లారిని పక్కకు తీసి రోడ్డు క్లియర్ చేశారు. గతంలో పలు చోట్ల మద్యం, చేపలు, కూరగాయలు, కూల్ డ్రింగ్స్ లోడ్ తో వెళ్తున్న ట్రక్కులు బోల్తా పడటంతో స్థానికులు, వాహనదారులు ఎగబడి ఎత్తుకెళ్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే లారీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నా వారిని పట్టించుకోకుండా.. కనీస మానవత్వం లేకుండా లూటీ చేయడంపైనే దృష్టి సారించేవారు. ఇలాంటి సంఘటనల వల్ల వాటి యజమానులు లక్షల్లో నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
పండ్ల లారీ బోల్తా.. ఎగబడి పండ్లని ఎత్తుకుపోయిన జనం
నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న నారింజ పండ్ల లారీ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుష్టి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీలోని నారింజ పండ్లన్నీ కిందపడ్డాయి. స్థానికులు ఎగబడి పండ్లను సంచుల్లో నింపుకుని… pic.twitter.com/MIWHfumtB2
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2024