iDreamPost
android-app
ios-app

వీడియో: ఉచితంగా కూరగాయలు ఎగబడ్డ జనం! ఎక్కడంటే..

Free Vegetables In Peddapalli: ప్రస్తుతం కూరగాయల ధరలు బాగా మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఓప్రాంతంలో కూరగాయాలను ఫ్రీగా పంచేస్తున్నారు. దీంతో ఉచితంగా వచ్చే కూరగాయలను పొందేందుకు జనం ఎగబడుతున్నారు.

Free Vegetables In Peddapalli: ప్రస్తుతం కూరగాయల ధరలు బాగా మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఓప్రాంతంలో కూరగాయాలను ఫ్రీగా పంచేస్తున్నారు. దీంతో ఉచితంగా వచ్చే కూరగాయలను పొందేందుకు జనం ఎగబడుతున్నారు.

వీడియో: ఉచితంగా కూరగాయలు ఎగబడ్డ జనం! ఎక్కడంటే..

ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటి ధరలు చూసి సామాన్యులు అల్లాడిపోతున్నాడు. దేనిని పట్టుకున్నా కూడా షాక్ కొట్టేంతగా ధరలు ఉన్నాయి. టమాట, ఉల్లిగడ్డలు మొదలు దాదాపు చాలా కూరగాయాలు ఎక్కువ ధర ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కడైనా ఫ్రీగా కూరగాయలు ఇస్తున్నారంటే.. వదులుతారా?. తాజాగా ఓ ప్రాంతంలో కూరగాయాలు ఉచితంగా ఇస్తున్నారు. దీంతో వాటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..ఈ ఫ్రీ వెజిటెబుల్స్ ఎక్కడ, ఎందుకు ఇస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

పెద్దపల్లి జిల్లాలో ఉచితంగా కూరగాయాలను అందుస్తున్నారు. చాలా మంది ఈ విషయాన్ని నమ్మకపోయిన్.. వందకు వంద శాతం ఈ మాట నిజమే. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ విషయం పట్టణం మొత్తం వ్యాపించింది. దీంతో ఉచితంగా కూరగాయాలు వస్తున్నాయని తెలియడంతో ప్రజలు భారీ సంఖ్యలో మార్కెట్ కు  తరలివచ్చారు. అంతేకాక తమ వెంట తెచ్చుకున్న సంచుల్లో అన్ని రకలా కూరగాయలను తీసుకెళ్లారు. మరికొందరు అయితే సంచులు, సంచులు కూరగాయలు పట్టుకెళ్లారు. ఇలా ఫ్రీగా కూరగాయాలను ఇవ్వడంపై చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. అయితే ఫ్రీగా కూరగాయాలు ఇవ్వడానికి గల కారణం ఓ వివాదం.

మార్కెట్లో హోల్సేల్, రిటైల్ కూరగాయల వ్యాపారుల మధ్య వివాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రిటైల్ వ్యాపారులు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ఒప్పందం ప్రకారం హోల్‌సెల్ వ్యాపారులు రిటైల్ గా కూరగాయలు విక్రయించకూడదని, వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక హోల్ సెల్ వ్యాపారులు చేస్తున్న పనిపై ఆగ్రహించిన రిటైల్ వ్యాపారులు మంగళవారం నిరసన తెలియజేశారు. కూరగాయలన్నీ ఉచితంగా పంచిపెడుతూ తమ నిరసనను తెలియజేశారు. ఇక కూరగాయాలు ఫ్రీగా ఇస్తున్నారని తెలియడంతో జనాలు భారీగా మార్కెట్ లో క్యూ కట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.