iDreamPost
android-app
ios-app

వీడియో: మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్.. బస్సులో రచ్చ చేసిన యువతి

తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్.. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, యువతులకు, విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించింది. ఈ పథకానికి ఎంతటి ఆదరణ లభించిందో.. అంతటి వివాదం నెలకొంటుంది.

తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్.. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, యువతులకు, విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించింది. ఈ పథకానికి ఎంతటి ఆదరణ లభించిందో.. అంతటి వివాదం నెలకొంటుంది.

వీడియో: మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్..  బస్సులో రచ్చ చేసిన యువతి

తెలంగాణలోఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వడివడిగా హామీలను అమలు చేస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించారు. అలాగే.. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచారు. ఫ్రీ బస్సు సౌకర్యాన్ని మహిళలకే కాకుండా ట్రాన్స్ జెండర్స్, యువతులు, విద్యార్థినులకు కూడా అందించింది రాష్ట్ర సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో సిటీ, పల్లెవెలుగు, మెట్రో, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణించవచ్చునని పేర్కొంది. అయితే దీనికి రాష్ట్ర నివాసి అని నిర్దారించే గుర్తింపు పొందిన కార్డులు తప్పని సరి అని పేర్కొంది. ఈ పథకం విశేష ఆదరణ పొందింది. అలాగే పలు తంటాలు తెచ్చిపెడుతోంది.

ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన దగ్గర నుండి మహిళలు సీట్ల కోసం తన్నుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఓ యువతి రచ్చ రచ్చ చేసింది. బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించాలంటే.. కచ్చితంగా రాష్ట్రంలో నివసిస్తున్న గుర్తించే ఆధార్, ఓటర్ వంటి ఒరిజినల్ కార్డులను క్యారీ చేయాలని చెబుతున్నారు బస్సులో ఉన్న కండక్టర్, డ్రైవర్లు. అప్పుడే జీరో టికెట్ జారీ చేస్తామని చెబుతున్నారు. పై నుండి జీవో వచ్చిందని, ఫోనులో కానీ బయట కానీ జిరాక్స్ చూపించినా, ఆధార్ పీడీఎఫ్ చూపించినా చెల్లదని, డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాలని పేర్కొంటున్నారు. అయితే కొంత మంది వీటిని క్యారీ చేయకుండా ఫోనులో జిరాక్స్, వాటి కాపీలను చూపిస్తున్నారు. వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు కండక్టర్. కచ్చితంగా ఒరిజినల్ కార్డులు చూపించాలంటూ పేర్కొంటున్నారు. ఈ విషయంపైనే వివాదం రాజుకుంది.

free bus journy

బస్సు ఎక్కిన యువతికి ఆధార్ కార్డు చూపించాలని కండక్టర్ కోరగా.. ఆమె ఫోనులో ఉన్న సాఫ్ట్ కాపీని చూపించింది. దీన్ని మహిళా కండక్టర్ అంగీకరించలేదు. దీంతో ఆ యువతి రెచ్చిపోయింది. ‘ఆధార్ ఐడి ఒక్కటే ఉంటుంది, ఫోనులో.. అయితే ఏంటీ.. ఇది ఒరిజినలే. నా ఆధార్ నంబర్ కొట్టు నా పేరు రాదా’ అంటూ ప్రశ్నించింది. సెల్ ఫోనులో ఉంటే తీసుకుపోరు అంటూ కండక్టర్ అనగానే.. ‘ఆధార్ చూపిస్తున్నాం కదా. ఎందుకు చెల్లదు. నువ్వు చదువుకోలేదేమో..నేను చదువుకోలేదా.. నాకు తెల్వదా.. ఇండియా మొత్తంలో ఎక్కడైనా నా ఆధార్ నంబర్ కొట్టు నా పేరే వస్తది’ అని వాగ్వాదానికి దిగింది. ‘ఏం చదువుకున్నావ్.. రూ. 10 కోసం సెన్స్ లెస్ మాటలు మాట్లాడుతున్నావ్. ఆధార్ ఫోనులో చూపిస్తున్నా కదా’ అంటూ రెచ్చిపోయింది.

‘ఏంటీ మీ ప్రాబ్లమ్.. డీఎంతో మాట్లాడాలా’ అని ప్రశ్నించగా.. కాదూ టికెట్ తీసుకోవాలని కండక్టర్ కోరగా.. ‘రూ. 10 మ్యాటర్ కాదు..కాకపోతే స్కీం పెట్టి.. మాకు హెల్ప్ చేసేటట్లు ఉండాలి కానీ.. ఇలా చేస్తే ఎలా’ అంటూ ప్రశ్నించింది యువతి. ‘నేను సెల్ ఫోనులో ఐడీ చూపిస్తున్నా కదా.. మీకు ఏంటీ ప్రాబ్లమ్’ అని చెప్పగా.. లేదు.. ఆధార్ మీ దగ్గరే ఉండాలి అంటూ మహిళా కండక్టర్ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆమెకు సపోర్టివ్‌గా కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది ఈ పథకం సమస్యలు తెచ్చిపెడుతుందని ముందే చెప్పలేదా అంటున్నారు. మరీ ఆ అమ్మాయి అనేది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి.