Dharani
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేస్తోంది. అయితే దీనిపై ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ చోట ఆర్టీసీ డ్రైవర్ మీద ఆటోడ్రైవర్లు దాడి చేశారు. ఆ వివరాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేస్తోంది. అయితే దీనిపై ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ చోట ఆర్టీసీ డ్రైవర్ మీద ఆటోడ్రైవర్లు దాడి చేశారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద మహళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ కల్సిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీద సంతకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. వయసుతో సంబంధం లేకుండా.. మహిళలంతా.. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడకైనా ఉచితంగా పర్యటించవచ్చు. పల్లెవెలుగు, ఆర్డీనరీ, ఎక్స్ప్రేస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అమల్లో ఉంది. ఇక పథకం అమలైన దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తోన్న మహిళల సంఖ్య భారీగా పెరిగిందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని.. గిరాకీలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆటో డ్రైవర్లతో భేటీ అయ్యారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణ వల్ల బస్సుల్లో రద్దీ పెరిగిందని.. తమకు కనీసం నిలబడటానికి కూడా చోటు ఉండటం లేదని మగవాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మగవారి కోసం ప్రత్యేకంగా బస్సులు నడపాలని ఆర్టీసీ వర్గాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఉండగా.. ఓ చోట ఆర్టీసీ డ్రైవర్ మీద ఆటో డ్రైవర్లు దాడి చేశారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కొత్తగూడెం డిపో నుంచి బయలుదేరిన పల్లె వెలుగు బస్సు.. కూడలిలోని పోస్టాఫీసు వద్దకు వచ్చి ఆగింది. దాంతో అప్పటి వరకు ఆటోల్లో ఉన్న ప్రయాణికులంతా దిగి.. బస్సు ఎక్కారు. దాంతో ఆగ్రహానికి గురైన ఆటో డ్రైవర్లు.. ఆవేశంతో బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడి చేశాడు.
బస్సు రావడం వల్ల తమ గిరాకీ పోయిందని.. ఆగ్రహించిన ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్ నాగరాజు మీద దాడి చేశారు. అతడిపై నీళ్లు చల్లుతూ అసభ్య పదజాలంతో దూషించారు. కండక్టర్ సరస్వతి, ఇతర వాహనదారులు.. ఆటోడ్రైవర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారు ఆగలేదు. ఈఘటనపై కొత్తగూడెం డిపో మేనేజర్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారణ చేపట్టారు.
బస్సు డ్రైవర్ మీద దాడి చేసిన ఆటో డ్రైవర్లు
కొత్తగూడెం డిపో నుంచి ఖమ్మం బయల్దేరిన పల్లెవెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్ కూడలికి చేరుకుంది. అప్పటి వరకు స్థానిక సర్వీసు ఆటోల్లో వెళ్లామనుకున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సెక్కారు. అదే సమయంలో అక్కడున్న నలుగురు ఆటోడ్రైవర్లు ఆవేశంతో… pic.twitter.com/k0yeJKXLkA
— Telugu Scribe (@TeluguScribe) December 28, 2023